Just In
- 20 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Krack Box Office బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో.. మూడు రోజుల్లో ఎంత కొల్లగొట్టిందంటే?
మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. సంక్రాంతి సీజన్‌ను రవితేజ పూర్తిగా వాడుకునేలా కనిపిస్తోంది. క్రాక్ సినిమాయే సంక్రాంతి సంబరాలకు నాంది పలికింది. సినిమా విడుదల విషయంలో మొదటి రోజు కాస్త గందరగోళం ఎదురైనా కూడా మొత్తంగా స్థిరంగా వసూళ్లను కొల్లగొడుతూ దూసుపోతోంది. నేడు మాస్టర్ సినిమా ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కూడా రచ్చ చేస్తున్నాడు రవితేజ.

బాక్సాఫీస్ వద్ద జోరు..
క్రాక్ మొదటి రోజు కాస్త డల్ అయింది. ఎందుకంటే పడాల్సిన షోలకంటే చాలా తక్కువే పడ్డాయి. కొన్ని చోట్ల కేవలం ఒక్క షోనే నడిచింది. ఇంకొన్ని చోట్ల ఫస్ట్ షో సెకండ్ షో మాత్రమే నడిచాయి. అలా మొదటి రోజు కాస్త నెమ్మదిగా కలెక్షన్ల ప్రవాహాం మొదలైంది.

మూడో రోజు ఇలా..
ఇక క్రాక్ సినిమా మూడో రోజు కొల్లగొట్టిన బాక్సాఫీస్ లెక్కలు ఇలా ఉన్నాయి. నైజాంలో 1.12 కోట్లు, సీడెడ్‌లో 55 లక్షలు, ఉత్తరాంధ్రలో 29 లక్షలు, ఈస్ట్ 22 లక్షలు, వెస్ట్ 16 లక్షలు, గుంటూరు 20.3 లక్షలు, కృష్ణా 16.5 లక్షలు, నెల్లూరులో 15 లక్షలు కొల్లగొట్టింది.

మొత్తంగా అలా..
ఇక మూడో రోజు మొత్తంగా చూసుకుంటే. 4.9 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. ఇక షేర్ వ్యాల్యూలో చూసుకుంటే మొత్తంగా మూడో రోజు మాత్రం 2.86కోట్లు కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఇంకా బ్రేక్ ఈవెక్ అడుగు దూరంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటి వరకు ఎంతంటే..
క్రాక్ సినిమా ఇప్పటి వరకు బాగానే రన్ అవుతూ వచ్చింది. మొదటి రెండు మూడు రోజల కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. నైజాం ఏరియాలో 4.43 కోట్లు, సీడెడ్లొ 2.16కోట్లు, ఉత్తరాంధ్రలో 1.49కోట్లు, ఈస్ట్ 1.07కోట్లు, వెస్ట్ 91 లక్షలు, గుంటూరు 1.09కోట్లు, కృష్ణా 82లక్షలు, నెల్లూరులో 58లక్షలు కొల్లగొట్టాయి.

ఇక మొత్తం ఎంత రాబట్టాలంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా నుంచి 44 లక్షలు, ఓవర్సీస్ నుంచి 57 లక్షలు ఇలా మొత్తంగా మూడు రోజుల్లో 22 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. 13.56 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కేవలం 3.94కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది.