Just In
- 21 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నరసింహానాయుడు సినిమాకు 20 ఏళ్ళు.. అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే
సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారి స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లాడనే చెప్పాలి . అప్పట్లో బాలకృష్ణ సినిమా అంటే రాష్ట్రమంతా ఒక రేంజ్ లో హడావుడి ఉండేది. ఇక సంక్రాంతికి ఆయన సినిమాలు వస్తే తప్పకుండా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఇక ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో నరసింహానాయుడు ఒకటి. ఆ సినిమా వచ్చి నేటికి 20 ఏళ్లయ్యింది.

2001సంక్రాంతిలో బాలయ్య హవా..
నందమూరి బాలకృష్ణ అప్పట్లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. కమర్షియల్ ఆయన చేసిన సినిమాలు ఒక ట్రెండ్ సెట్ చేశాయనే చెప్పాలి. ఇక బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిమ నరసింహా నాయుడు సినిమా కూడా ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. అత్యదిక ప్రాఫిట్స్ అంధించిన సినిమాల లిస్ట్ తీస్తే ఇది కూడా అందులో ఉంటుంది. 2001లో ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దర్శకుడితో మూడో సినిమా
దర్శకుడు బి.గోపాల్ , బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లారీ డ్రైవర్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. అనంతరం రౌడీ ఇన్స్పెక్టర్ కూడా ట్రెండ్ సెట్ చేసింది. ఇక మూడవసారి వచ్చిన నరసింహానాయుడు అయితే అంతకు మించి అనేలా కాసుల వర్షాన్ని కూరిపించింది.

అత్యదిక వసూళ్లను అందుకున్న సినిమా
ఇక సినిమా హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వసూళ్లను భారీగా అందుకోవడంతో నిర్మాతకు మంచి లాభాలు వచ్చాయి. మొత్తంగా 20కోట్ల వరకు షేర్స్ ని అందించింది. ఒక విదంగా అప్పటి వరకు అత్యదిక వసూళ్లను అందుకున్న సినిమా అదే కావడం విశేషం. బాలకృష్ణ మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఈ కాంబోలో మరో సినిమా..
ఇక బి.గోపాల్ బాలకృష్ణ నాలుగోసారి చేసిన చిత్రం పలనాటి బ్రహ్మనాయుడు. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. అయినప్పటికీ వీరి కాంబినేషన్ పై అభిమానుల్లో అంచనాలు కూడా తగ్గలేదు. మరోసారి సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ఆ మధ్య ప్రాజెక్ట్ సెట్టయినట్లు టాక్ వచ్చింది గాని వర్కౌట్ కాలేదు. మంచి కథ సెట్టయితే బి.గోపాల్ బాలయ్యతో సినిమాను ఎనౌన్స్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.