Just In
- 4 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగా హీరో కోసం భారీగా ఖర్చు చేయనున్న పవన్ కళ్యాణ్.. అతను మళ్ళీ తిరిగిస్తాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఆర్థిక సహాయలు ఏ రేంజ్ అందిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఎలాంటి ఘటనలు జరిగినా అందరికంటే ముందుగా స్పందించి సహాయం అంధించే వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పవన్ ఆర్థికంగా కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. అందుకే వరుసగా సినిమాలను చేస్తూ భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఆయన మరోసారి ప్రొడక్షన్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతగా.. రెండు సినిమాలు ప్లాప్..
పవన్ కళ్యాణ్ నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్, అలాగే యువ హీరో నితిన్ ఛల్ మోహన్ రంగా సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. కానీ ఆ రెండు సినిమాలు కూడా పవర్ స్టార్ కు అంతగా లాభాలను అందించలేకపోయాయి. ఇక నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు.

త్రివిక్రమ్ సలహా మేరకు..
పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మించాలని ఎప్పటి నుంచో కథలను వింటున్నాడు గాని ఏది నమ్మకంగా అనిపించడం లేదు. అలాగే త్రివిక్రమ్ కూడా కొన్ని కథలను సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయాన సలహా మేరకు రెండు కథలను పెండింగ్ లిస్ట్ లో పెట్టినట్లు ఒక టాక్ అయితే వస్తోంది.
ఫోటోలు: అల వైకుంఠపురము రీయూనియన్..పాల్గొన్న చిత్ర బృందం

ఆ దర్శకుడితో కొత్త సినిమా
ఇక ముందుదా డైరెక్టర్ కిషోర్ పార్థసాని(డాలీ) చెప్పిన కథకు పవన్ టెంప్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వీరి కాంబినేషన్ లో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల అనంతరం మరో సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ కథ సెట్టవ్వలేదు. అయితే పవన్ ఈ సారి నిర్మాతగా మారి ఆ దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

హీరో అతనే..
ఇక పవన్ నిర్మించబోయే సినిమాలో హీరో మరెవరో కాదు. ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్న వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, కిషోర్ పార్థసాని కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కు ఈ హీరో ఎంతవరకు లాభాలను అందిస్తాడో చూడాలి.