యువ హీరో నితిన్ స్పెషల్ ట్వీట్ తో అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. చాలా రోజుల తరువాత తాను కూడా సినిమాకు వచ్చినట్లు పోస్ట్ చేసి ఫొటోలను వైరల్ అయ్యేలా చేశాడు. లాక్ డౌన్ తరువాత వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో జనాలు మెల్లగా థియేటర్స్ కు అలవాటు పడుతున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా థియేటర్స్ వచ్చేస్తున్నారు.
అలాగే యువ హీరో నితిన్ కూడా థియేటర్ లో సినిమా చూసేందుకు వచ్చాడు. హైదరాబాద్ AMB సినిమాలో రవితేజ క్రాక్ సినిమా చూసేందుకు వచ్చినట్లు చెప్పిన నితిన్ చాలా రోజుల తరువాత సినిమా చూస్తున్నట్లు చెప్పాడు. ఒక నార్మల్ ఆడియేన్ లో థియేటర్ ఫోటోలకు పోజులు కూడా ఇచ్చేశాడు. ఇక నితిన్ నెక్స్ట్ రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాపై అభిమానుల్లో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక 'రంగ్ దే' సినిమాను మార్చ్ 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత నితిన్ 'చెక్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఆ సినిమాను చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
The career of Tollywood young hero Nithiin continues to be very different from the very beginning. Nitin, who broke box office records with Jayam at an early age, has a very low success rate in his career. However, he is constantly balancing his market. After a long time, he had a big plan to be happy not only personally but also professionally. But that plan failed. Nithiin is causing unforeseen losses along with Corona for the delay.
Story first published: Tuesday, January 12, 2021, 12:33 [IST]