Just In
- 10 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 35 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Finance
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో షాకింగ్ ఘటన: ఆ మూవీ టికెట్ అమ్మిన రామ్.. హీరోపై దారుమైన ట్రోల్స్!
బడా నిర్మాత ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎనర్జిటిక్ యాక్టింగ్, అదిరిపోయే డ్యాన్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో హీరోగా రాణిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'రెడ్' అనే మూవీతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఆ వివరాలు మీకోసం!
రెడ్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ..రామ్ హంగామా చూడండి (ఫోటోలు)

కెరీర్లోనే బంపర్ హిట్‌ను కొట్టిన రామ్
కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను అందుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ మూవీ కోసం అతడు పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది. అంతేకాదు, విమర్శలకు ప్రశంసలు కూడా దక్కాయి.

మరోసారి అతడితో కలిసి చేస్తున్నాడు
‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి చిత్రాల తర్వాత కిశోర్ తిరుమలతో ‘రెడ్' అనే సినిమా చేస్తున్నాడు రామ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సొంత బ్యానర్లో స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఇందులో హీరోయిన్లు మాళవిక, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్లు నటించారు. అలాగే, రామ్ తొలిసారి ద్విపాత్రభినయం చేశాడు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.

ఆఫర్లన్నీ పక్కకు.. సంక్రాంతి పోరులో
సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. లాక్డౌన్ సమయంలో దీన్ని విడుదల చేసేందుకు చాలా ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చాయి. అంతేకాదు, దీనికి భారీ స్థాయిలో ఆఫర్లు కూడా ఇచ్చాయి. కానీ, వీటన్నింటినీ పక్కన పెట్టేసి రామ్ అండ్ కో... సంక్రాంతి పోరులో నిలబెట్టింది. ఇక, ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వాటన్నింటికీ అదిరిపోయే స్పందన
వైవిధ్యమైన సబ్జెక్టుతో తెరకెక్కిన ‘రెడ్' సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్లు, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సహా ఎన్నో విడుదలయ్యాయి. వాటన్నింటికీ ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో కొన్ని పాటలకు, ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మార్కెట్ కూడా బాగానే జరిగింది.

రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో షాకింగ్ ఘటన
‘రెడ్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ కార్యక్రమంలో అందరూ ఈ సినిమా గురించి మాట్లాడారు. దీనికి ప్రేక్షకులు కూడా బాగానే హాజరయ్యారు. ఇక, ఈ ఈవెంట్లో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఇదిప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఆ మూవీ టికెట్ అమ్మిన రామ్.. ట్రోల్స్
ఈ ఈవెంట్లో భాగంగా తన సినిమా టికెట్‌ను దర్శకుడు త్రివిక్రమ్‌కు అమ్మాడు రామ్. అయితే, అతడు అమ్మింది తన సినిమా ‘రెడ్' టికెట్ కాదు. రవితేజ నటించిన ‘క్రాక్'ది. ఈ విషయాన్ని గమనించిన వెంటనే ‘క్రాక్'పై ‘రెడ్' ప్లాస్టర్ అతికించారు. కానీ, రిలీజ్ డేట్ మాత్రం జనవరి 9నే ఉంచారు. మొత్తానికి ఏదో చేయబోయి.. మరేదో చేయడంతో హీరో రామ్‌పై ట్రోల్స్ వస్తున్నాయి.