Just In
- 50 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 3 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ హీరోపై సమంత సీక్రెట్ ఇన్వెస్ట్మెంట్.. ఇంతవరకు నాగచైతన్యపై కూడా అంత పెట్టలేదు?
అక్కినేని వారి కోడలు సమంత హీరోయిన్ గా సినిమాలు తగ్గించినప్పటికి తన రేంజ్ కు తగ్గట్లుగానే అడుగులు వేస్తోంది. అసలు ఆమె పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేయాల్సిన అవసరం కూడా లేదు. సోలో హీరోయిన్ గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు అందుతాయి. ఇప్పటికే 'ఓ బేబి: సినిమాతో ఒకసారి ఋజువయ్యింది.

కేవలం తనకు నచ్చిన పాత్రలనే
సమంత అక్కినేని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లవుతోంది. ఇక రంగస్థలం సినిమా తరువాత జెస్సి పెద్ద హీరోలతో సినిమాలు చేసింది లేదు. ఇక తమిళ్ లో కూడా ఒక రెండు పెద్ద సినిమాలు చేసింది. అయితే చాలా వరకు సామ్ కేవలం తనకు నచ్చిన పాత్రలనే సెలెక్ట్ చేసుకుంటోంది. మహానటిలో ఆ పాత్రను తను ఎంతో ఇష్టపడి చేసింది.

ఆఫర్స్ తగ్గినా కూడా..
ఇక అవకాశం వస్తే జాను వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలు చేయడానికి కూడా రెడీ అని నీరూపించింది. ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అయితే కాలేదు. ఇక ప్రస్తుతం ఆఫర్స్ తగ్గినా కూడా పలు షోలతో బిజీ అయ్యే ప్రయత్నం చేసింది. బిగ్ బాస్ అనంతరం ఆహా యాప్ లో ఒక షోకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

మరోసారి ప్రొడక్షన్ వైపు..
సామ్ జామ్ షో క్లిక్కవ్వడంతో అలాంటి ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. అయితే సమంత చాలా రోజుల తరువాత మళ్ళీ ప్రొడక్షన్ లోకి వెలుతోంది. ఒకసారి 'యూ టర్న్' సినిమాను సొంత ప్రొడక్షన్ లో నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా పెద్దగా లాభాలను అంధించలేదు. అయితే మళ్ళీ చాలా రోజుల తరువాత ఒక టాలెంటెడ్ హీరోకు అలాగే మ్యాటర్ ఉన్న దర్శకుడి కోసం ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యిందట.

అతని కోసం..రూ.5కోట్లు
ఇంతవరకు నాగచైతన్య కోసం కూడా ఖర్చు చేయని సమంత హీరో సుధీర్ బాబు సినిమా కోసం రూ.5 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తోందట. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమాలో తాను కూడా భాగం అవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతూ మరొక ప్రొడక్షన్ హౌజ్ తో జత కలిసి పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. మరి ఆ సినిమా సమంతకు ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.