For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్తకు గుడ్‌బై చెప్పబోతున్న ప్రముఖ నటి.. ఏడేళ్ల దాంపత్యానికి త్వరలోనే తెర!

    |

    హాలీవుడ్‌లో ప్రముఖ దంపతులు కిమ్ కర్దాషియాన్, కాన్యే వెస్ట్ విడిపోతున్నారనే ఊహాగానాలు గత కొద్దికాలంగా మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూరేలా వారిద్దరు విడాకులు తీసుకోవడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తున్నది. గత కొద్దికాలంగా వారిద్దరి ఎవరికి వారే ఉంటున్నట్టు సమాచారం. కిమ్, కాన్యే దంపతుల విభేదాల గురించి మరింత లోతుకు వెళ్తే..

    నలుగురు పిల్లలతో కిమ్ కర్దాషియాన్f

    నలుగురు పిల్లలతో కిమ్ కర్దాషియాన్f

    ఇప్పటికే కాన్యే వెస్ట్ నుంచి కిమ్ కర్దాషియాన్ వేరుపడింది. తన నలుగురు పిల్లల్ని తీసుకొని లాస్ ఎంజెలెస్‌లోని తన నివాసంలో ఉంటున్నారు. కాన్యే వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. వారి మధ్య విభేదాలు పరిష్కరించుకొలేని స్థాయికి వెళ్లడంతో వారిద్దరి విడిపోవడానికి పావులు కదుపుతున్నారు అని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

     ఏడేళ్ల దాంపత్య జీవితం ప్రశ్నార్తకం

    ఏడేళ్ల దాంపత్య జీవితం ప్రశ్నార్తకం

    కాన్యే వెస్ట్‌తో కిమ్ వైవాహిక జీవితం ముగింపు దశకు చేరుకొన్నది. దాదాపు 7 ఏళ్ల దాంపత్య జీవితానికి తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హాలీవుడ్‌లో ర్యాపర్‌గా సుపరిచితుడైన కాన్యేకు విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధం అవుతున్నారు అని పలు ప్రముఖ మీడియాలో కథనాలను ప్రచురించాయి. కాన్యే, కిమ్ మే 2014లో వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో..

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో..

    కొద్ది నెలల క్రితం అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో వారి దాంపత్య జీవితంలో కలహాలు చోటు చేసుకొన్నాయి. అప్పటి నుంచి వారిద్దరూ తరచుగా కలుసుకొంటున్నారు. కిమ్ తల్లిపై కాన్యే తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. గత మూడు నెలల క్రితం వారిద్దరు కలిసి మీడియాకు కనిపించిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు వారిద్దరు కలువలేదు.

    కీలక నిర్ణయం కోసం ఒంటరిగా

    కీలక నిర్ణయం కోసం ఒంటరిగా

    తన జీవితం గురించి కీలక నిర్ణయం తీసుకోవడానికి కాన్యే వెస్ట్ చాలా సమయం వెచ్చిస్తున్నారు. వోమింగ్‌లో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో లేరు. తన చుట్టు ఉన్న వ్యక్తులు ఆయన మానసిక ధైర్యాన్ని అందిస్తున్నారు అని కాన్యే సన్నిహితులు పేర్కొంటున్నారు.

    English summary
    Hollywood's Star couple Kim Kardashian and Kanye West are planning for divorce after 7 years marriage. They have rift while american presidential elections. That rift widen since that never come to mend in their relations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X