Just In
- 42 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
KGF నుంచి మరో సర్ప్రైజ్: రాఖీ భాయ్ వచ్చేది ఎప్పుడో తెలిసిపోయింది
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా రేంజ్ మూవీగా రూపొంది.. అన్ని చోట్లా భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. మరీ ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో యశ్‌ను ఎలివేట్ చేసి చూపించిన తీరుకు సినీ ప్రియులంతా ఫిదా అయిపోయారు. అందుకే ఇది ఇండియన్ సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. అంతేకాదు, జాతీయ అవార్డుల్లో సైతం సత్తా చాటింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.
మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో.. రెండో భాగం 'KGF Chapter 2'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే దాన్ని రిలీజ్ చేశారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందనే వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ టీజర్ వ్యూస్, లైక్స్ విషయంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు కన్నడ ప్రేక్షకులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి మరో గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.
కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్.. అదిరిపోయే షాట్స్ ఇవే

తాజా సమాచారం ప్రకారం... 'KGF Chapter 2'ను జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ డేట్‌ను లాక్ చేసేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, చాప్టర్ 1 చివర్లో గరుడను చంపి కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకుంటాడు రాఖీ భాయ్. ఇలాంటి సమయంలో అతడికి అధీర రూపంలో మరో శత్రువు పుట్టుకొస్తాడు. అతడిని ఎలా అంతమొందిచాడు అన్న కథతో రెండో భాగం రూపొందుతోంది. ఇందులో అధీరగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా శ్రీనిథి శెట్టి నటిస్తుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్, రావు రమేష్ సహా ఎంతో మంది ప్రముఖలు కీలక పాత్రను పోషిస్తున్నారు.