Just In
- 13 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 37 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Finance
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రేవ్ పార్టీపై పోలీసుల మెరుపు దాడి.. యువ హీరోయిన్ అరెస్ట్..
ఇప్పటి వరకు బాలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలకు పరిమితమైన డ్రగ్స్ రాకెట్ కేసు వ్యవహారం ఇప్పుడు మాలీవుడ్‌ను తాకింది. ఓ రిసార్టులో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలుసుకొన్న కేరళ పోలీసులు మెరుపదాడి చేసి ఓ హీరోయిన్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇంతకు కేరళ పోలీసుల దాడుల్లో అరెస్ట్ అయిన హీరోయిన్ ఎవరంటే..

బాలీవుడ్, కన్నడ చిత్ర పరిశ్రమలో
సినీ పరిశ్రమతో డ్రగ్స్ రాకెట్ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో రియా చక్రవర్తికి ఉన్న డ్రగ్స్ లింకులు బయటపడటం.. ఆ తర్వాత ఎన్సీబీ అరెస్ట్ చేయడం సంచలనంరేపింది. ఆ తర్వాత కన్నడ పరిశ్రమలో లింకులు బయటకు రావడంతో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలను అరెస్ట్ చేయడం తెలిసిందే.

మాలీవుడ్‌లో రేవ్ పార్టీ
తాజాగా మాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ వ్యవహారం బయటపడింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ జరుగుతున్నదననే సమాచారం అందుకొన్న పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. వగమాన్లోని క్లిఫ్ ఇన్ రిసార్టుపై జరిపిన దాడుల్లో బ్రిస్టీ బిస్వాస్‌ను అరెస్ట్ చేశారు. రిస్టార్టులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు. పలువురుని అరెస్ట్ చేసి మాలీవుడ్‌తో డ్రగ్స్ సంబంధాలను ఆరా తీస్తున్నారు.

ఏడు రకాల డ్రగ్స్ స్వాధీనం
ఇడుక్కి జిల్లాలోని ఓ రిసార్టులో సీక్రెట్‌గా జరుగుతున్న పార్టీపై దాడులు చేసిన నేపథ్యంలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. ఈ పార్టీ నుంచి ఏడు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నట్టు తెలిసింది. ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, గంజాయి, ఎక్స్టసీ పిల్స్, ఎక్స్టసీ పౌడర్, చరస్, హాషిస్ లాంటి డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. బిస్ట్రీ బిస్వాస్ అరెస్ట్‌తో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

రేవ్ పార్టీలో 58 మంది
మలయాళ నటి బ్రస్టీ బిస్వాస్‌కు డ్రగ్స్ మాఫియాతో బలమైన సంబంధాలున్నాయనే విషయం బయటకు వచ్చింది. కేరళలోని థ్రిపునితురా ప్రాంతానికి చెందిన బ్రిస్టీ పట్టణం నుంచే డ్రగ్స్ సరఫరా జరిగినట్టు తెలుస్తున్నది. పోలీసులు దాడి చేసిన సమయంలో మొత్తం 58 మంది ఉన్నట్టు సమాచారం.