Just In
- 9 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. లాస్యపై యాంకర్ రవి ఫైర్
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా యాంకర్ రవి లాస్య కలిసి హోస్ట్ చేయడం, ఆ ఈవెంట్, వీరిద్దరి కలయిక గురించే చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా రవి లాస్యలు కలిసిపోయారు. కలిసి ఒకే షోను హెస్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌తో ఇద్దరి మధ్య మంచి బంధమే ఏర్పడినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఇద్దరూ తాజాగా లైవ్‌లోకి వచ్చారు. కలిసి ముచ్చట్లు పెట్టారు. ఎన్నో విషయాల గురించి క్లారిటీగా చెప్పారు.

ఆ విషయంపై..
తాజాగా రవి లాస్య, నోయల్, అభిజిత్, హారికలను సోషల్ మీడియాలో ఓ ప్రశ్న అడిగాడు. దానికి సమాధానం వస్తుందా? లేదా? అని ఎదురుచూశాడు. కానీ చివరకు ఒక్క హారిక మాత్రమే రిప్లై ఇచ్చింది. అసలు సంగతి ఏంటంటే.. నోభికస్యను ఇంటర్వ్యూ చేయమని ఓ నెటిజన్ రవిని అడిగాడు.

రెడీ అంటూ..
లాస్య, రవి మీరు కలిసిపోయారు కదా అంటూ ఓ నెటిజన్ చెబుతూ.. అభిక నోభిక నోభికస్యతో కలిసి ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేయండంటూ రవికి సలహా ఇచ్చాడు. నేను వారితో చేసేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటాను. వాళ్లు ఒప్పుకోవాలి కదా? అని రవి ప్రశ్నించాడు. ఆ తరువాత అదే పోస్ట్‌ను ఆ నలుగురికి ట్యాగ్ చేయగా.. ఒక్క హారిక మాత్రమే స్పందించింది.

మిగతా ఎవ్వరూ కూడా..
లాస్య, నోయల్, హారిక, అభిజిత్‌లను ట్యాగ్ చేసిన రవి.. ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని అడిగాడు. దీనిపై హారిక మాత్రం స్పందిస్తూ.. నేను రెడీ టైం డేట్ చెప్పు ఇచ్చి పడేద్దాం అంటూ చెప్పేసింది. కానీ మిగతా ఎవ్వరూ కూడా రెస్పాండ్ కాలేదు. దానిపై తాజాగా రవి స్పందించాడు.

తాజాగా అలా..
తాజాగా యాంకర్ రవి, లాస్య కలిసి లైవ్‌లోకి వచ్చారు. రేపు ప్రసారం కాబోతోన్న ఇట్సే ఫ్యామిలీ పార్టీ ఈవెంట్ గురించి చెబుతూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమనండని కోరారు. ఈ క్రమంలో రవి లాస్య మాట్లాడుతూ ఎన్నో విషయాలు బయట పెట్టారు.

కొంచెం కూడా..
నోభికస్య ఇంటర్వ్యూ గురించి నేను పబ్లిక్‌గా అడిగితే రిప్లై ఇవ్వరా? కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా అంటూ లాస్యపై యాంకర్ రవి కామెంట్ చేశాడు. ఒక్క హారికే రిప్లై ఇచ్చింది గుడ్ గర్ల్.. అంటూ రవి చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలో నోయల్, నేను హారిక అదే చర్చించుకుంటున్నామని నోభికస్య ఇంటర్వ్యూ చేస్తే నేనే ఫస్ట్ చేయాలి.. నాకే ఇవ్వాలని గొడవ పెట్టుకుంటున్నామని లాస్య చెప్పుకొచ్చింది.