Just In
- 53 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 3 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దటీజ్ పవర్ స్టార్.. ‘మాస్టర్’లో అత్తారింటికి దారేది.. ఆ సీన్‌తో విజయ్ రచ్చ
దళపతి విజయ్ మాస్టర్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇన్నాళ్ల నుంచి ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. మాస్టర్ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ ఫ్యాన్స్, సెలెబ్రిటీలు ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మాస్టర్ క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మాస్టర్ సినిమాలోని విజయ్ సూపర్ డైలాగ్స్, షాట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఫ్యాన్స్ హంగామా..
తమ అభిమాన హీరో సినిమా ఇంత గ్రాండ్‌గా రిలీజ్ అవ్వడం, ఇన్ని రోజులు ఎదురు చూపుల తరువాత సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మాస్టర్ ఫస్ట్ డే ఫస్ట్ షో రచ్చే నడుస్తోంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

క్లిప్స్ రచ్చ..
ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సినిమాలోని కొన్ని అల్టిమేట్స్ క్లిప్స్‌ను కూడా షేర్ చేస్తుంటారు. స్పెషల్ సీన్స్‌కు సంబంధించిన క్లిప్స్‌ను సోషల్ మీడియాలో వదులుతూ తమ హీరో సత్తా చాటుతుంటారు. అలాగే ఇప్పుడ కొన్ని మాస్టర్ సీన్స్ వైరల్ అవుతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సీన్‌ను విజయ్ వివరిస్తున్నాడు.
రెడ్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ..రామ్ హంగామా చూడండి (ఫోటోలు)

అత్తారింటికి సీన్..
మాస్టర్ సినిమాలో విజయ్ ఓ సీన్లో హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలోని క్లైమాక్స్ సీన్ గురించి చెబుతూ ఫ్లర్ట్ చేస్తాడు. తన అత్తకు ఓ అందమైన కూతురు ఉందని తన గురించి చెప్పేందుకు స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించానని ఆ కథ చెప్పాడు. ప్రస్తుతం ఈ క్లిప్‌ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

తమిళ్లో మరి..
అయితే తెలుగులో ఈ సీన్ కోసం పవన్ కళ్యాణ్ క్రేజ్‌ను వాడుకున్నారు. మరి తమిళంలో ఏ సీన్ పెట్టి ఉంటారా? అని తెలుగు అభిమానులు అనుకుంటున్నారు. మొత్తానికి మాస్టర్ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో ఖుషీ అవుతున్నారు. మాస్టర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డ్‌లు క్రియేట్ చేసేలానే ఉంది.