Just In
- 28 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 53 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Kaagaz movie review: పంకజ్ త్రిపాఠి, మోనాల్ గజ్జర్ నట విశ్వరూపం
మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా అద్భుతమైన ఫెర్ఫార్మెర్గా గుర్తింపు తెచ్చుకొన్న పంకజ్ త్రిపాఠి, బిగ్‌బాస్ తెలుగు 4 దక్షిణాది ప్రేక్షకుల హృదయాల స్థానం సంపాదించుకొన్న మోనల్ గజ్జర్ కలిసి నటించిన హిందీ చిత్రం కాగజ్. ప్రముఖ దర్శకుడు సతీష్ కౌశిక్ నటించి, దర్శకత్వం వహించిన కాగజ్ చిత్రం జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఉందనే విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం!

కాగజ్ కథ ఏమిటంటే...
పెళ్లిళ్లలకు, శుభకార్యాలకు బ్యాండ్ మేళాన్ని నడిపించే భారత్ లాల్ (పంకజ్ త్రిపాఠి), ఆయన భార్య రుక్మిణి (మోనాల్ గజ్జర్) సరైన ఆదాయం లేకపోవడం అనేక కష్టాలు పడుతుంటారు. బ్యాంకులో లోను తీసుకొని బ్యాండ్ మేళ్లాన్ని నేటి అవకసరాలకు అనుగుణంగా మార్చుకోవాలనుకొంటారు. తన ఊర్లో వారసత్వంగా వచ్చిన భూమిని బ్యాంకులో పెట్టి రుణం తీసుకోవాలనుకొంటాడు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో తాను మరణించినట్టు ఉండటం ఆయనకు షాక్ కలిగిస్తుంది.

కాగజ్ కథలో మలుపులు
ప్రభుత్వ రికార్డుల ప్రకారం తాను మరణించినట్టు అధికారులు చెప్పడంతో అతనిలో కంగారు మొదలవుతుంది. ఈ క్రమంలో తాను బతికే ఉన్నానంటూ ప్రూవ్ చేసుకొనే క్రమంలో కోర్టులను, ఉన్నతాధికారులను, కలెక్టర్లు, ఎమ్మెల్యే, చీప్ మినిస్టర్, ప్రధానికి లేఖ రాస్తారు. అయినా భరత్ లాల్ ఎక్కడ న్యాయం జరుగదు. ఈ నేపథ్యంలో భరత్ లాల్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. అధికార వ్యవస్థతో అమీ తుమీ తేల్చుకొనేందుకు భరత్ లాల్ ఏం చేశాడనే ప్రశ్నకు సమాధానమే కాగజ్.

దర్శకుడు సతీష్ కౌశిక్ పనితీరు
దేశంలోని సామాజిక వ్యవస్థలో పేపర్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉన్నదనే విషయాన్ని కథగా ఎంచుకొని దర్శకుడు సతీష్ కౌశిక్ రాసుకొన్న కథనం అద్భుతంగా అనిపిస్తుంది. తన జీవితానికి, అస్థిత్వానికి ముప్పు కలిగిన విషయంలో వ్యవస్థపై భరత్ లాల్ చేసిన పోరాటం భావోద్వేగంగా సాగుతుంది. సెకండాఫ్‌లో కథలోకి అమేథీ ఎన్నికల్లో రాజీవ్ గాంధీతో ఎన్నికల్లో పోటీపడటం, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో గలాటా.. అధికారులుపై దాడులు లాంటి సీన్లు సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చుతాయి. ఇదంతా దర్శకుడు ప్రతిభకు అద్ధం పడుతుంది.

పంకజ్ త్రిపాఠి పెర్ఫార్మెన్స్
ఇక పంకజ్ త్రిపాఠి నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీర్జాపూర్ లాంటి వెబ్ సినిమాలతో అద్భుతంగా ఆకట్టుకొన్న పంకజ్ త్రిపాఠి నెక్ట్స్ లెవెల్ ఫెర్ఫార్మెన్స్ అందించాడనే చెప్పవచ్చు. తొలి భాగంలో 15 నిమిషాల్లోపే అసల కథ మొదలు కావడంతో సినిమా గంభీరంగా మారుతుంది. వినోదం, భావోద్వేగం, ఎమోషనల్‌గా కథ ఎన్నో మలుపులు తిరుగుతు ప్రేక్షకుడిని థ్రిల్ కలిగిస్తాయి. భరత్ లాల్ పాత్రలో జీవించిన తీరు అభినందనీయం. తన నటనతో మరోసారి పంజక్ త్రిపాఠి విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు.

మోనాల్ గజ్జర్ భారమైన పాత్రలో
బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మోనాల్ గజ్జర్ గ్లామర్‌కు దూరంగా గృహిణి లాంటి భారమైన పాత్రలో నటించి మెప్పించారు. భర్త చేసే పోరాటానికి ఆదిలో సహకరిస్తుంది. ఈ క్రమంలో విపరీతంగా అప్పులు కావడం, ఇంటి అర్థిక పరిస్థితి దిగజారడంతో పోరాటం ఆపివేయాలని సూచిస్తుంది. కానీ చట్టం ప్రకారం తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి మొండిగా ముందుకు వెళ్లడంతో భర్తకు మోనాల్ దూరం అవుతువుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్లను మెచ్యురిటీతో మెప్పించింది. ఇప్పటి వరకు గ్లామర్ నటిగానే పరిచయం అయిన మోనాల్ ఈ చిత్రంలో పరిణతి చెందిన నటి కనిపిస్తుంది.

టెక్నికల్ విభాగాల పనితీరుల
కాగజ్ సినిమా విషయానికి వస్తే.. టెక్నికల్ డిపార్ట్మెంట్ల పనితీరు చాలా ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ ఓ రేంజ్లో ఉంటుంది, ప్రవేశ్ మాలిక్, రాహుల్ జైన్, సీజర్ సంగీత త్రయం పనితీరు బాగుంది. ఎడిటింగ్, కెమెరా విభాగాల పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. 80 నుంచి 90 దశకంలో సాగే కథకు ఆ ఫీల్‌ను కలిగించడంలో ఆర్ట్ విభాగం సఫలమైంది.

ఫైనల్‌గా
కాగజ్ సినిమాను సల్మాన్ ఖాన్, దర్శకుడు సతీష్ కౌశిక్ సొంత బ్యానర్లలో నిర్మించారు. కథనే ఈ సినిమాకు హీరోగా అనిపిస్తుంది. పంకజ్ త్రిపాఠి నటన మరో రేంజ్లో ఉంటుంది. ఈ సినిమా భారాన్ని పంకజ్ త్రిపాఠి ఒంటిచేత్తో మోశాడని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అద్భుతమైన కంటెంట్ ఉన్న చిత్రంగా కాగజ్ను చెప్పుకోవచ్చు ఎమోషనల్, ఫ్యామిలీ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. మంచి సినిమా చూశామనే మంచి ఫీలింగ్ కలుగుతుంది.

తెర వెనుక, తెర ముందు..
నటీనటులు: పంకజ్ త్రిపాఠి, మోనాల్ గజ్జర్, సతీష్ కౌశిక్, సందీపా ధార్, అమర్ ఉపాధ్యాయ తదితరులు
దర్శకత్వం: సతీష్ కౌశిక్
నిర్మాత: సల్మాన్ ఖాన్, నిశాంత్ కౌశిక్, వికాస్ మలు
మ్యూజిక్: ప్రవేశ్ మాలిక్, రాహుల్ జైన్, సీజర్
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, ది సతీష్ కౌశిక్ ఎంటర్టైన్మెంట్
ఓటీటీ రిలీజ్: ZEE5
ఓటీటీ రిలీజ్ డేట్: 2021-01-07
నిడివి: 109 నిమిషాలు