Just In
- 10 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 54 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గోవాలో రొమాంటిక్ సాంగ్స్.. యూత్‌కి పిచ్చెక్కించేలా పూరి స్టైల్ మేకింగ్
ఆకాష్ పూరి హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'రొమాంటిక్'. కొడుకును ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కించి స్టార్ హీరోని చేయాలని తాపత్రయ పడుతున్న పూరి.. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను అనిల్ పాదూరి చేతిలో పెట్టారు. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన అందాల భామ కేతికశర్మ హీరోయిన్గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా గోవాలో చిత్రం లోని పాటల షూటింగ్ జరుపుతోంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ లోనే కొన్ని కీలక సన్నివేశాలను కూడా షూట్ చేయనున్నారట. ప్రస్తుతం హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ పూర్తిగా పూరి జగన్నాథ్ స్టైల్ లోనే తెరకెక్కిస్తున్నారని సమాచారం. యూత్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయేలా ఈ సాంగ్ లోని రొమాంటిక్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది.
మరోవైపు ఇటీవలే విడుదలైన 'రొమాంటిక్' ఫస్ట్‌లుక్ పోస్టర్ యూత్ ఆడియన్స్‌కి కిక్కించింది. హీరోయిన్ కేతికశర్మను టాప్ లెస్‌గా వెనుక నుంచి చూపించి అందరి దృష్టినీ లాగేశారు. ఇక టాప్ లెస్‌గా ఉన్న హీరోయిన్ని తన చేతులతో చుట్టి పడేశాడు ఆకాష్ పూరి. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే రొమాంటిక్ సినిమాలో రొమాన్స్ పీక్స్ స్టేజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుండటం మరో విశేషం. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాఫియా నేపథ్యంలో ఓ రొమాంటిక్ ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి.