Just In
- 33 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 57 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారీ బడ్జెట్‌తో విజయ్ ఆంటోని.. అక్కడ షూటింగ్ జరుపుకుంటోన్న తొలి ఇండియన్ సినిమా
'బిచ్చగాడు'తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ పొందారు విజయ్ ఆంటోనీ. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ మంచి ఆదరణ పొందుతున్నారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, అక్షరా హాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం 'అగ్ని సిరగుగల్'. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెడీ అవుతున్న క్రేజీ సినిమాల్లో ఇదొకటి.
ఈ సినిమాను తెలుగులో 'జ్వాల' టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్. దాదాపు 25 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. ఈ రోజు హీరో విజయ్ ఆంటోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న జ్వాల విశేషాల గురించి చిత్రబృందం మాట్లాడింది.
జ్వాల తొలి షెడ్యూల్‌ను చెన్నై, కోల్కత్తా వంటి లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించామని తెలిపారు. ఆ తర్వాతి షెడ్యూల్‌ను మాస్కో, రష్యా వంటి దేశాల్లో కనువిందైన లొకేషన్స్‌లో షూట్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం తుది షెడ్యూల్‌ను కజకిస్తాన్‌లో షూట్ చేస్తున్నామని ప్రకటించారు. కజకిస్తాన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న తొలి ఇండియన్ సినిమా మాదే అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు.

విజువల్ ఫీస్ట్‌గా తమ సినిమా ఉండబోతోందన్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు యాక్షన్ మూవీ లవర్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నామని అన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదన్నారు. సినిమా అవుట్‌పుట్ చూస్తుంటే చాలా సంతృప్తికరంగా ఉందని తెలిపారు.
దర్శకుడు నవీన్ అద్భుతమైన విజన్‌తో యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే ట్రైలర్, ఆడియో, చిత్ర రిలీజ్ వివరాలు తెలియజేస్తామని తెలిపారు. రైమా సేన్, ప్రకాశ్ రాజ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నటరాజన్ శంకరన్, కెమెరా: కేఏ బట్చా, సమర్పణ- అమ్మ క్రియేషన్స్ టి.శివ, నిర్మాతలు-జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల.