Just In
- 5 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వైరల్ వీడియో: హీరోయిన్‌పై అక్కడ చేయి వేసి హత్తుకున్న విజయ్.. హెడ్‌లైన్స్‌లో రౌడీ స్టార్.!
టాలీవుడ్లో డిఫరెంట్ స్టైల్స్‌తో పాటు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో కనిపించే హీరోల్లో ప్రప్రథమంగా చెప్పుకునే పేరు విజయ్ దేవరకొండ. చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్‌ను ఆరంభించిన ఈ యంగ్‌స్టర్.. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. 'గీత గోవిందం' కూడా సక్సెస్ అవడంతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈ రౌడీ స్టార్ షూటింగ్ స్పాట్లో ఓ హీరోయిన్ను హగ్ చేసుకున్న వీడియో లీక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం.!


క్రేజీ స్టార్‌కు కలిసి రావడం లేదు
కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అయితే, కొన్నేళ్లుగా అతడి కెరీర్ ఒడిదుడుకులతో సాగుతోంది. ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలన్నీ పరాజయం పాలవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నో అంచనాలతో విడుదలైన ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' దేవరకొండకు నిరాశనే మిగిల్చాయి.

విజయ్ ఆశలన్నీ ఆయన మీదే
వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఆయన వల్ల సినిమా రేంజ్ పెరిగింది
మొదట ఈ సినిమాను తెలుగులో మాత్రమే రూపొందించాలని పూరీ జగన్నాథ్ భావించారు. అయితే, ఈ స్క్రిప్టు గురించి విన్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో సాగే ఈ మూవీని పూరీ, ఛార్మీతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

ఫేమస్ టైటిల్ పోయే.. వింతది వచ్చే
ఫైటింగ్ నేపథ్యంతో సాగే కథ కావడంతో ఈ సినిమాకు మొదట ‘ఫైటర్' అనే టైటిల్ అనుకున్నారు. ఈ మూవీ కోసమే విజయ్ థాయ్‌ల్యాండ్ వెళ్లి మరీ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా పలు భాషల్లో విడుదల కాబోతున్న నేపథ్యంతో టైటిల్‌ను ‘లైగర్' అని మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీని అర్థం తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు.
|
యంగ్ హీరోయిన్ హత్తుకున్న విజయ్
ఇటీవల ‘లైగర్' కోసం రాత్రి షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో తీసిన కొన్ని ఫొటోలు లీక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్ స్పాట్‌కు వెళుతున్న సమయంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బోటులో కూర్చుని ఉన్న విజయ్.. హీరోయిన్ అనన్య పాండే నడుముపై చేయి వేసి హగ్ చేసుకున్నట్లు అందులో కనిపిస్తోంది.

దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోన్న విజయ్ పేరు
ఈ వీడియోలో హైలైట్ అయ్యేంత విషయం ఏమీ జరగలేదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, విజయ్ హగ్ చేసుకున్నదే చర్చనీయాంశం అవుతోంది. మనవాళ్లు దీన్ని పెద్దగా కవర్ చేయలేదు కానీ, నేషనల్ మీడియాలో మాత్రం ఈ వీడియో హాట్ టాపిక్ అవుతోంది. దీనిని ఉద్దేశిస్తూ కొన్ని కథనాలు కూడా వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు.