Just In
- 30 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 54 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్: అప్పుడు మహేశ్, పవన్, ఎన్టీఆర్.. ఇప్పుడు రవితేజ.. షాకిస్తోన్న లెక్కలు!
సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కాంబినేషన్ల దగ్గర నుంచి సినిమా టైటిల్, నటీనటుల ఎంపిక, పాటలు, ఫైట్స్‌తో పాటు రిలీజ్ డేట్ల వరకు చాలా రకాల పద్దతులను ఫాలో అవుతుంటారు. అంతేకాదు, ఈ మధ్య కాలంలో సినిమా ఫంక్షన్లకు వచ్చే గెస్టులను కూడా సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్ 'క్రాక్' సినిమాతో మొదలైంది. ఎన్నో అనుమానాల నడుమ విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్లో ఓ కొత్త సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. అంతా మాట్లాడుకుంటోన్న దాని గురించి మీకోసం!

జూనియర్ ఎన్టీఆర్ అలా ట్రాక్ ఎక్కాడు
‘బృందావనం' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి', ‘ఊసరవెల్లి', ‘దమ్ము', ‘రామయ్య వస్తావయ్య', ‘రభస' వంటి ఎన్నో చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘టెంపర్'తో అతడు హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇందులో తారక్ పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు. ఈ సినిమా నుంచి అతడు వరుసగా ఐదు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

మహేశ్‌ను నిలబెట్టిన అజయ్ కుమార్
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘పోకిరి'తో భారీ విజయాన్ని అందుకున్న మహేశ్ బాబు.. ఆ తర్వాత ‘సైనికుడు', ‘అతిథి', ‘ఖలేజా' వంటి వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీను వైట్ల రూపొందించిన ‘దూకుడు'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇందులో మహేశ్ చేసింది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే. ఈ సినిమాలో అతడి కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంది.

పవన్ కల్యాణ్‌కు గబ్బర్ సింగ్‌తో బ్రేక్
కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాడు పవన్ కల్యాన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా' తర్వాత అతడు ‘పులి', ‘తీన్మార్', ‘పంజా' వంటి భారీ డిజాస్టర్లను చవి చూశాడు. ఇలాంటి సమయంలో హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్'తో హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందుకున్నాడు. ఇందులో పవన్ పోలీస్ క్యారెక్టర్ చేసిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్‌కు కలిసొచ్చిన ధృవ రోల్
రాజమౌళి రూపొందించిన ‘మగధీర' తర్వాత అంతటి రేంజ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు రామ్ చరణ్. దీని తర్వాత అతడు ఎన్నో సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలాంటి సమయంలో తమిళ చిత్రం ‘తని ఒరువన్'కు రీమేక్‌గా వచ్చిన ‘ధృవ'తో చెర్రీ బిగ్ హిట్‌ను అందుకున్నాడు. ఇందులో అతడు పోషించిన ఐపీఎస్ ఆఫీసర్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

బన్నీ కూడా ఆ బట్టలతోనే కొట్టాడుగా
‘దేశముదురు' తర్వాత చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో సతమతం అయ్యాడు అల్లు అర్జున్. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘జులాయి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత మరోసారి ‘రేసు గుర్రం'తో హిట్‌ను అందుకున్నాడు. బన్నీ కెరీర్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రంలో అతడు పోలీస్ గెటప్‌తో కనిపిస్తాడు. ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

రవితేజతో తెరపైకి వచ్చిన సెంటిమెంట్
ఇక, ‘రాజా ది గ్రేట్' తర్వాత రవితేజ కూడా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో గోపీచంద్ మలినేని రూపొందించిన ‘క్రాక్'తో అతడు సక్సెస్‌ను అందుకున్నాడు. ఇందులో రవితేజ పోలీస్ పాత్ర గురించే అంతా మాట్లాడుతున్నారు. ఇలా.. హిట్ లేక ఇబ్బందులు పడిన కొందరు తెలుగు హీరోలు పోలీస్ డ్రెస్ వేసి సక్సెస్ అందుకుంటున్నారన్న మాట.