Just In
- 54 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 3 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆసక్తికరంగా ‘కోబ్రా’ టీజర్: అదిరిపోయే గెటప్‌తో అంచనాలు పెంచేస్తోన్న విక్రమ్
విలక్షణ నటనతో ఎంతో కాలంగా దక్షిణాదిలోనే బెస్ట్ యాక్టర్‌గా వెలుగొందుతోన్నాడు చియాన్ విక్రమ్. పేరుకు సీనియర్ హీరోనే అయినా.. కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కష్ట పడుతూ సత్తా చాటుతున్నారాయన. అదే సమయంలో సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో కష్టాన్ని కూర్చి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసిన విక్రమ్.. తన పంథాను కొనసాగిస్తూ ప్రస్తుతం 'కోబ్రా' అనే సినిమాను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.
సైంటిఫిక్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న 'కోబ్రా'ను ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపించారు. అలాగే, పలు రకాలుగా దర్శనమివ్వడంతో పాటు ఓ విచిత్రమైన గెటప్‌తో విక్రమ్ కనిపిస్తున్నాడు. ప్రతి వారికీ సమస్యలు వస్తుంటాయి.. వాటిన్నింటినీ గణితం ద్వారా పరిష్కారం చూపించవచ్చు అనే చెప్పే మ్యాథమెటిషీయన్గా విక్రమ్ కనిపించాడు. ఈ టీజర్‌కు అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని అందించింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఇదిలా ఉండగా, గత క్రిస్మస్ సందర్భంగా 'కోబ్రా' నుంచి విక్రమ్‌కు సంబంధించిన మరో లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో విక్రమ్ షాకింగ్ లుక్‌లో కనిపించాడు. అతని సగం మెదడులో ఎన్నో అంకెలు, సమస్యలు ఉన్నట్లు చూపించారు. ఈ చిత్రంలో విక్రమ్ 20కి పైగా విభిన్న గెటప్ల్లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ మూవీలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కీలక పాత్రను పోషిస్తుండగా.. శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.