Just In
- 8 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 52 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజిత్‌ను నమ్ముకునే ఈవెంట్ చేశారా?.. ఎంతైనా మామూలు క్రేజ్ కాదిది!!
సంక్రాంతి వచ్చింది.. బుల్లితెరపై సందడిని తీసుకొచ్చింది. బుల్లితెరపై అన్నీ చానెల్స్ ఏదో ఒక సర్ ప్రైజ్ ఇస్తూ స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేశారు. ఈటీవీలో ఎప్పటిలానే జబర్దస్త్, రోజా, ఆది, అనసూయ అంటూ అక్కడే తిరుగుతున్నాడు. జీ తెలుగు తన సీరియల్ ఫ్యామిలీలను తీసుకొచ్చాడు. స్టార్ మాలో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో స్పెషల్ ఈవెంట్‌కు రెడీ అయ్యాడు. ఇలా మూడు ఈవెంట్లకు దేనికవే పోటీలో దూసుకుపోతోన్నాయి.

మూడు ఈవెంట్లతో రచ్చ..
ఈ సంక్రాంతికి ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేసేందుకు భారీ తారాగణమే వచ్చింది. ఈటీవీలో అన్నపూర్ణమ్మ రాగా స్టార్ మాలో ఈవెంట్ అయిన ఇట్సే ఫ్యామిలీ పార్టీలో అల్లుడు అదుర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ వచ్చేశాడు. ఇక జీ తెలుగు సంక్రాంతి సంబరాల్లో రామ్ గెస్ట్‌గా వచ్చి REDను ప్రమోట్ చేసుకోనున్నాడు.

ఇట్సే ఫ్యామిలీ పార్టీ అంటూ..
స్టార్ మాలో బిగ్ బాస్ కంటెస్టెంట్లను ముందు పెట్టి ఇట్సే ఫ్యామిలీ పార్టీ అంటూ ఈవెంట్‌ను చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యాంకర్ రవి, లాస్యను ఐదేళ్ల తరువాత ఒకే చోటుకు తీసుకొచ్చారు. ఒకే షోను హోస్ట్ చేసేలా ప్లాన్ చేశారు. అలా ఈ ఈవెంట్‌పై అందరికీ హైప్ పెరిగింది

ఫ్యామిటీ టచ్..
సంక్రాంతి అంటే కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి సందడి చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఈవెంట్‌ను స్టార్ మా వాళ్లు సెలెబ్రిటీలను తీసుకొచ్చి.. తమ తమ ఫ్యామిలీతోనే కలిపి ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. హీరోయిన్ సుహాసిని, కార్తీక దీపం హిమ తల్లిదండ్రులతో బాగానే ఎమోషన్ పండించారు.

అభిజిత్ స్పెషల్ గెస్ట్..
ఇట్సే ఫ్యామిలీ పార్టీ ఈవెంట్ మొత్తానికి కూడా అభిజిత్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతోన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అభిజిత్‌కు బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేతగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. మొత్తంగా అభిజిత్ క్రేజ్‌తో ఈవెంట్‌కు బాగానే హైప్ వచ్చింది.

స్పెషల్ అట్రాక్షన్..
ఇక ఈ ఈవెంట్‌కు అభిజిత్ తన తల్లితో కలిసి వచ్చాడు. అభిజిత్, అతని తల్లికి ఇప్పుడు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరిపై రిలీజ్ చేసిన ప్రోమో ఓ రేంజ్లో ఉంది. మొత్తంగా చూస్తే అభిజిత్ క్రేజ్‌ను బాగానే వాడుకుందామని ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్టున్నారు.