Just In
- 3 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మళ్లీ రెచ్చిపోయిన అఖిల్ - మోనాల్: ఈ సారి ఏకంగా పబ్లిక్ ప్లేస్లోనే.. ఒక్క పోస్టుతో బుక్కైపోయారు!
బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్లుగా వచ్చి.. జంటగా ఫేమస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. మిగిలిన భాషల్లో మాదిరిగానే తెలుగులోనూ ప్రతి సీజన్లో ఏదో ఒక జంట విపరీతంగా పాపులర్ అవుతోంది. ఇప్పటికే ఇలా ఎన్నో జోడీలు ఎనలేని క్రేజ్‌ను అందుకోగా.. ఇటీవల ముగిసిన నాలుగో సీజన్లో పాత వాళ్లను మరిపిస్తూ ఫేమస్ అయ్యారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. హౌస్‌లో రచ్చ చేసిన వీళ్లిద్దరూ బయటకొచ్చాక కూడా హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పబ్లిక్ ప్లేస్లోనే రెచ్చిపోయి తమ ప్రేమను బయటపెట్టుకున్నారు. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరిపై అంచనాలు లేవు.. ఒకరిలా.. ఒకరలా
బిగ్ బాస్ నాలుగో సీజన్లో బాగా హైలైట్ అయింది అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ. వాస్తవానికి వీళ్లిద్దరూ ఏమాత్రం అంచనాలు లేకుండానే హౌస్‌లోకి ప్రవేశించారు. అయితే, సరైన ఆటతీరుతో తమ మార్క్ చూపిస్తూ ఆకట్టుకున్నారు. ఈ కారణంగానే అఖిల్ ఫినాలేకు కూడా చేరుకోగా.. మోనాల్ కూడా ఊహించని విధంగా పద్నాలుగు వారాల పాటు హౌస్‌లో కొనసాగింది.

లవ్ ట్రాకుతో పాపులర్... చెట్టాపట్టాలేసుకుని
మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన అఖిల్ సార్థక్.. ప్రముఖ హీరోయిన్ మోనాల్ గజ్జర్ లవ్ ట్రాకు వల్ల బాగా పాపులర్ అయ్యారు. షో ఆరంభం నుంచే చనువుగా ఉండడంతో పాటు ఎవరికి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకునే వారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అందుకు అనుగుణంగానే హౌస్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.

రొమాన్స్ డోస్ పెంచిన జోడీ.. విమర్శలపాలు
తన మనసులో A ఉన్నాడని పరోక్షంగా అఖిల్ సార్థక్‌పై ఉన్న ప్రేమను బయట పెట్టింది మోనాల్ గజ్జర్. అప్పటి నుంచి వీళ్లిద్దరూ హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా అతడి పుట్టినరోజున అతడిపై ముద్దుల వర్షం కురిపించిందామె. దీంతో రోజూ నా బర్త్‌డే అయితే బాగుండు అని అఖిల్ చేసిన కామెంట్ వైరల్ అయింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరిపై విమర్శలూ వచ్చాయి.

బయటకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోతూ
గ్రాండ్ ఫినాలేకు ఒక వారం రోజుల ముందు మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చేసింది. ఆ సమయంలోనే హౌస్‌లో ఉన్న అఖిల్ సార్థక్‌కు సపోర్ట్ చేస్తూ ఎన్నో పోస్టులు పెట్టింది. అలాగే, ఆ మధ్య జరిగిన ఇంటర్వ్యూలలో అతడికి ఓట్ చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది. షో ముగిసిన తర్వాత ఏకంగా అర్ధరాత్రి సమయంలో అఖిల్ సార్థక్ ఇంటికెళ్లి సర్ప్రైజ్ చేసింది.

మళ్లీ రెచ్చిపోయిన అఖిల్ సార్థక్ మోనాల్ గజ్జర్
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక ఇంటర్వ్యూతో బిజీగా ఉంటున్నారు అఖిల్.. మోనాల్. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ తమ బంధాన్ని హైలైట్ చేసి చెబుతూనే ఉన్నారు. సోషల్ మీడియా చాట్లలో సైతం ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల న్యూ ఇయర్ పార్టీని సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి జరుపుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.

పబ్లిక్ ప్లేస్లోనే.. ప్రేమను అలా బయటపెట్టారు
తాజాగా అఖిల్, మోనాల్, సోహెల్ కలిసి హైదరాబాద్‌లో రోడ్లపై రచ్చ రచ్చ చేశారు. నైట్ పార్టీలో వీళ్లిద్దరూ ఒకరికొకరు గులాబీ పూలు ఇచ్చుకుంటూ దిగిన ఫొటోను అఖిల్ షేర్ చేశాడు. అంతేకాదు, ‘నన్ను వదిలిపెట్టే ధైర్యం చేయకు' అని అందులో క్యాప్షన్ పెట్టాడు. దీనిపై స్పందించిన మోనాల్.. ‘ఆ ఛాన్సే లేదు' అంటూ కామెంట్ చేసింది. దీంతో వీళ్ల మధ్య ప్రేమ మరోసారి బయటపడింది.