For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కౌన్‌బనేగా కరోడ్‌పతి సీజన్ 13: ఇలా రిజిస్టర్ చేసుకోండి!

  |

  కరోనా భయంతో దేశం మొత్తం వణికిపోతోంది. జనాలు బయటకు రావడమే కష్టం అనుకుంటుంటే ఇక టీవీ రియాలిటీ షోలు, సినిమాల షూటింగులు ఇక గగనమే. అందుకే ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభం కావాల్సిన ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా వాయిదా పడింది అని అంటున్నారు. అయితే ఇదంతా మన దగ్గర కానీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో మాత్రం మొదలు అయిపోతుంది. సోనీ టెలివిజన్ నిర్వహిస్తున్న ఈ షోలో సామాన్యులు సైతం తమ ప్రతిభతో లక్షలు గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే కరోనా ఉన్నా సరే జనానికి దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో కరోనా జాగ్రత్తలు తీసుకుని షో కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు. ఇక ఈ కౌన్ బనేగా కరోడ్ పతి కోసం రిజిస్ట్రేషన్ లు ఓపెన్ కానున్నాయి. ఆ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

  రిజిస్ట్రేషన్లు మొదలు

  రిజిస్ట్రేషన్లు మొదలు

  కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 13 కోసం రిజిస్ట్రేషన్లు ఈ రోజు (మే 10, 2021) నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు సోనీ టీవీలో అమితాబ్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకు SMS ద్వారా లేదా సోనీ LIV యాప్ ద్వారా సమాధానం ఇవ్వాలి. ఇలా చేస్తే ప్రజలు తమను తాము నమోదు చేసుకున్నట్టే.

  ముందుగా షార్ట్ లిస్ట్ చేసి

  ముందుగా షార్ట్ లిస్ట్ చేసి

  ఈ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చిన కొంతమంది వ్యక్తులను ర్యాండంగా కొన్ని నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ ప్రమాణాలు ముందుగా నిర్ణయించబడతాయి అని చెబుతున్నారు. ఇక ఎంపిక చేసి, పాల్గొనాల్సిన వారిని టెలిఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇస్తారు. ఆ తరువాత ఏమి చేయాలి అనే అంశం మీద ఫోన్ లోనే టచ్ లో ఉంటారు.

  తరువాత ప్రాసెస్ ఏమిటంటే

  తరువాత ప్రాసెస్ ఏమిటంటే


  తదుపరి దశలో, ప్రజలు సాధారణ జనరల్ నాలెడ్జ్ పరీక్షతో పాటు వీడియో సమర్పణతో కూడిన ఆన్‌లైన్ ఆడిషన్లను క్లియర్ చేయాలి. ఈ ఆడిషన్లు సోనీ లైవ్ యాప్ లో స్పెషల్ గా చేయబడతాయి. ఇక ఈ ప్రక్రియ యొక్క అన్ని వివరాలు సోని లైవ్ యాప్ లో ట్యుటోరియల్ ద్వారా కూడా వివరించబడతాయి. ఇక ఈ ప్రాసెస్ తర్వాత చివరి ఇంటర్వ్యూ రౌండ్‌కు అర్హత సాధించాలి.

  Filmibeat Top Ten Stories ఫిల్మిబీట్ టాప్ టెన్ స్టోరీస్..

  కరోనా ఉన్నా డోంట్ కేర్


  ఇక నిజానికి గత ఏడాది కేబీసీ షూట్ లోనే అమితాబ్ కు కరోనా వచ్చింది. కోలుకున్న తరువాత జాగ్రత్తలు తీసుకుని షో కంప్లీట్ చేశారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఆడియన్స్ లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటించి షో నిర్వహించారు. గత సీజన్ సక్సెస్ కావడంతో ఈ ఏడాది కూడా కొత్త సీజన్ ఆరంభిస్తున్నారని అంటున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ లో కేబీసీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూద్దాం..

  English summary
  KBC Kaun Banega Crorepati is One of the most viewed Indian quiz shows, Kaun Banega Crorepati is now set to make a return to television with its 13th season. Hosted by Bollywood superstar Amitabh Bachchan, the show will soon be airing on Sony TV. For the 13th season, Sony TV shared the announcement via its Twitter handle. With the means of tweet, the TV channel encouraged users that if they “try, work hard and study,” they might get a chance to reach the platform and sit with the Bollywood actor as well as become a millionaire.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X