For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vakeel Saab Closing collections..ఎంత నష్టంతో వాటిల్లిందంటే.. పవన్ మూవీకి ఆ రెండు కారణాలే శాపంగా...

    |

    టాలీవుడ్‌లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ చిత్రం జర్నీ బాక్సాఫీస్ వద్ద ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో అప్రకటిత లాక్‌డౌన్ కొనసాగుతుండటం, రాత్రివేళల కర్ఫ్యూ కొనసాగుతున్న సమయంలో థియేటర్ యాజమాన్యమే స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నారు. దీంతో వకీల్ సాబ్ కథ థియేటర్లలో ముగిసినట్టే అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    కరోనా సమయంలో క్లినిక్‌లోకి కరీనా.. కెమెరా కంటికి చిక్కిన బ్యూటీ

    బోసిపోయిన సినిమా హాళ్లు

    బోసిపోయిన సినిమా హాళ్లు

    వకీల్ సాబ్ సినిమా ఇప్పటి వరకు దాదాపు 15 రోజులపాటు థియేటర్లలో ప్రదర్శించారు. గత రెండు మూడు రోజులుగా సినిమా హాళ్లకు ప్రేక్షకులు ముఖం చాటేశారు. పలు సినిమా హాళ్లు బోసిపోయారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత సంపూర్ణంగా మారింది. కరోనా ప్రతికూల పరిస్థితుల కారణంగా వకీల్ సాబ్ ప్రదర్శనలు పూర్తిగా నిలిచిపోయాయి.

    వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

    వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

    ఇక వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే.. సుమారు 90 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. నైజాంలో రూ.25.2 కోట్లు, సీడెడ్‌లో రూ.13.4 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.10.9 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.1 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6.3 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.7.6 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.6.5 కోట్లు, నెల్లూరులో రూ.3.35 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

     గత 15 రోజుల్లో వకీల్ సాబ్ స్టామినా

    గత 15 రోజుల్లో వకీల్ సాబ్ స్టామినా

    ఇక ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల కలెక్షన్లను ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.24.95 కోట్లు, సీడెడ్‌లో రూ.12.86 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.11.68 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.6.47 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 6.98 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.7.10 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.4.98 కోట్లు, నెల్లూరులో రూ.3.39 కోట్లు మేర వసూళ్లను రాబట్టింది.

    ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో దారుణంగా

    ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో దారుణంగా

    తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ రాబట్టినట్టుగా ఇతర రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లో కలెక్షన్లను వసూలు చేయలేకపోయింది. కర్ణాటకలో రూ.3.66 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.8 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.85.87 కోట్ల షేర్ రాబట్టగా, రూ.137.20 కోట్లు వసూలు చేసింది. దాంతో స్వల్ప నష్టాల్లో ఈ సినిమా బాక్సాఫీష్ జర్ని ముగిసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

     మొదటి రోజులే మురిపించి.. మిగితా రోజులు...

    మొదటి రోజులే మురిపించి.. మిగితా రోజులు...

    వకీల్ సాబ్ చిత్రం మొదటి రోజున రూ.32.24 కోట్లు వసూలు చేస్తే.. చివరి రోజున ఈ చిత్రం రూ.15 లక్షల షేర్ రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో రూ.52 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం మిగితా 12 రోజుల్లో 26 కోట్ల రూపాయల షేర్ రాబట్టడం జరిగింది. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా అంతగా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ఎక్కువగా నష్టపోయింది అక్కడే..

    ఎక్కువగా నష్టపోయింది అక్కడే..

    వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ను పరిశీలిస్తే.. ఓవర్సీస్‌లో భారీగా నష్టపోగా.. క‌‌ృష్ణా జిల్లాలో ఎక్కువగా నష్టపోయింది. పలు జిల్లాలో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోగా స్వల్ప నష్టాలను చూసింది. అయితే వకీల్ సాబ్ సినిమాను రాజకీయ, కరోనా పరిస్థితులు దెబ్బ తీశాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

    #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
    వకీల్ సాబ్‌కు ఎంత మేరకు నష్టమంటే..

    వకీల్ సాబ్‌కు ఎంత మేరకు నష్టమంటే..

    ఇక వకీల్ సాబ్ 95 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే చివరకు 85.87 కోట్ల రూపాయల వద్ద ఈ ప్రయాణం ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దాంతో ఈ చిత్రం క్లీన్ హిట్ సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    English summary
    Vakeel Saab Closing collections: Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. This movie trailer set a new record in Tollywood. Vakeel Saab trailer gaint 23.4 million views in 24 hours. In this occassion, Fimibeat Telugu brings Closing collections. Vakeel Saab registered 85.87 crores share and 137.20 crores gross worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X