For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vakeel Saab 13 days collections: బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన వకీల్ సాబ్.. నష్టం ఎంతంటే!

    |

    హిందీలో ఘన విజయం సాధించిన పింక్ రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భారీగా క్షీణించాయి. ఈ క్రమంలో వకీల్ సాబ్ 13 రోజున రాబట్టిన వసూళ్లు ఎంతంటే..

    అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

     ఓవర్సీస్‌లో వకీల్ సాబ్ వసూళ్లు

    ఓవర్సీస్‌లో వకీల్ సాబ్ వసూళ్లు

    వకీల్ సాబ్ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం వసూళ్లు 750k డాలర్ల వద్దే ఆగిపోయింది. 1.3 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ సాదించాల్సిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఆస్ట్రేలియాలో కూడా పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కేవలం 295k ఆస్ట్రేలియా డాలర్లు మాత్రమే వసూలు చేసింది.

    13వ రోజున వకీల్ సాబ్ కలెక్షన్లు

    13వ రోజున వకీల్ సాబ్ కలెక్షన్లు

    ఇక ఆంధ్రా, నైజాంలో వకీల్ సాబ్ 13వ రోజున పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నైజాంలో రూ.12 లక్షలు, సీడెడ్‌లో రూ.7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.5 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 లక్షలు, గుంటూరులో రూ.4.8 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.4.9 లక్షలు, నెల్లూరులో రూ.3 లక్షలు వసూలు చేసింది.

    మొత్తం 13 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

    మొత్తం 13 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

    వకీల్ సాబ్ చిత్రం ఏపీ, నైజాంలో రూ.50 లక్షల నికర వసూళ్లు, రూ.88 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఏపీ, నైజాంలో 13 రోజుల్లో ఈ చిత్రం రూ.78.04 కోట్లు, రూ.120.48 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.3.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో రూ.3.77 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
     ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికవరీ ఎంతంటే

    ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికవరీ ఎంతంటే

    వకీల్ సాబ్ చిత్రం రూ.90 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. 13వ రోజు నాటికి ఈ చిత్రం రూ.85.46 కోట్ల షేర్‌ను సాధించగా, రూ.136.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో సుమారు 90 శాతం మేర రికవరీ సాధించింది.

    English summary
    Vakeel Saab Day 13 collections: Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. This movie trailer set a new record in Tollywood. Vakeel Saab trailer gaint 23.4 million views in 24 hours. In this occassion, Fimibeat Telugu brings Day 13 collections. Vakeel Saab registered 85.46 crores share and 136.50 crores gross worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X