For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణకు షాకిచ్చిన బడా హీరోయిన్: ఆ అనుభవంతోనే భయం.. అందుకే ఆమె ఎంట్రీ ఇస్తుందట

  |

  కొంత కాలంగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. తన వందవ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయిన ఆయన.. వరుస పెట్టి ఐదు సినిమాల్లో నటించారు. అయితే, వీటిలో ఒక్కటి కూడా సక్సెస్‌ను అందించలేదు. ఇలాంటి సమయంలో బోయపాటి శ్రీనుతో 'అఖండ' చేస్తున్నారు. దీని తర్వాతి చిత్రాన్ని కూడా అప్పుడే లైన్‌లో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ షాక్ ఇచ్చిందట. ఆ వివరాలు మీకోసం!

  ‘అఖండ’లా మారి వస్తున్న బాలయ్య

  ‘అఖండ’లా మారి వస్తున్న బాలయ్య

  కొంత కాలంగా హిట్ కోసం అన్వేషిస్తోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

  సౌతిండియా రికార్డును బద్దలు కొట్టేసి

  సౌతిండియా రికార్డును బద్దలు కొట్టేసి


  ‘అఖండ' సినిమాకు సంబంధించిన టైటిల్ రోర్ వీడియో ఉగాది కానుకగా విడుదలైంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, వేగంగా యాభై మిలియన్లు దాటిన టీజర్‌గా టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. సీనియర్ హీరోల జాబితాలో సౌతిండియా రికార్డు బ్రేక్ చేసింది.

  యంగ్ డైరెక్టర్‌తో నటసింహం సినిమా

  యంగ్ డైరెక్టర్‌తో నటసింహం సినిమా

  ‘అఖండ' సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. యువ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నందమూరి బాలయ్య. ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా.. గోపీచంద్ ఈ ఏడాది సంక్రాంతికి రవితేజతో ‘క్రాక్' అనే సినిమాను రిలీజ్ చేశాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

  లైబ్రెరీల చుట్టూ తిరిగి మరీ రాసేశాడు

  లైబ్రెరీల చుట్టూ తిరిగి మరీ రాసేశాడు

  ‘క్రాక్'ను రూపొందించినట్లుగానే బాలకృష్ణతో చేయబోయే సినిమాను కూడా నిజమైన సంఘటనల ఆధారంగా తీయనున్నాడు గోపీచంద్ మలినేని. ఇందులో భాగంగానే అతడు తన సొంత జిల్లా ప్రకాశంకు వెళ్లాడు. అక్కడ ఉన్న జిల్లా లైబ్రెరీలో వేటపాలెం గ్రామానికి సంబంధించిన వందేళ్ల చరిత్ర గురించి పరిశోధనలు జరుపుతున్నాడు. దీనికి సంబంధించిన పిక్ కూడా వైరల్ అయింది.

  మళ్లీ అలాంటి సినిమాలో నటసింహం

  మళ్లీ అలాంటి సినిమాలో నటసింహం


  గోపీచంద్‌తో బాలకృష్ణ చేసే సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇక, ఇది రియల్ స్టోరీతో ఈ సినిమా రూపొందనుందని తెలిసిన తర్వాత ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక, ఈ మూవీ పల్నాడు నేపథ్యంతో సాగే ఓ ఫ్యాక్షన్ కథతో రూపొందుతోందనే ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో బాలయ్య చాలా కాలం తర్వాత ఫ్యాక్షనిస్టుగా నటిస్తున్నాడని అంటున్నారు.

  బాలకృష్ణకు షాకిచ్చిన బడా హీరోయిన్

  బాలకృష్ణకు షాకిచ్చిన బడా హీరోయిన్

  నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోయే సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని ఎంతో మంది హీరోయిన్లతో చర్చలు జరిపాడట. అందులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందని అంటున్నారు. అయితే, ఈ బ్యూటీ బాలయ్య సరసన నటించేందుకు నో చెప్పిందని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.

  Anandayya మందు పై గళం విప్పుతున్న Tollywood ప్రముఖులు || Filmibeat Telugu
  ఆ అనుభవంతో భయం.. అందుకే ఆమె

  ఆ అనుభవంతో భయం.. అందుకే ఆమె


  కేవలం యంగ్ హీరోలతోనే నటిస్తూ వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ మధ్య అక్కినేని నాగార్జునతో ‘మన్మథుడు' అనే సినిమా చేసింది. అయితే, ఇది ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో సీనియర్ హీరోలతో నటించకూడదని ఆమె డిసైడ్ అయిందట. అందుకే ఈ సినిమాకు నో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈమె రిజెక్ట్ చేసిన తర్వాతనే శృతి హాసన్‌ను ఈ మూవీ కోసం తీసుకున్నారట.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda Movie Under Boyapati Srinu Direction. After That He will do A Film with Gopichand Malineni. Now News is That.. Rakul Preet Singh Rejected This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X