For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వంటలక్కగా మారిన రకుల్ ప్రీత్ సింగ్.. వామ్మో అంటూ వీడియో పెట్టి మరీ పరువు తీసేసిన తమ్ముడు!

  |

  ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం తెలుగులో సినిమాలు కరువైన సంగతి తెలిసిందే. ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఈ భామ కూడా ముంబైకి మార్చేసింది. తాజాగా వంటలక్క అవతారమెత్తిన రకుల్ ప్రీత్ సింగ్ దెబ్బకు ఆమె తమ్ముడు బెదిరిపోయాడు. బెదిరి పోవడమే కాక ఆమె చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

  కన్నడ సినిమాతో

  కన్నడ సినిమాతో

  సెల్వరాఘవన్ 7జి బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ తో ఈ భామ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అప్పటికి తనకు సినిమాలు అంటే తెలియదని కానీ మోడలింగ్ చేసేప్పుడు వచ్చే డబ్బు కంటే సినిమాల్లో చేస్తే వచ్చే డబ్బు ఎక్కువగా ఉంటుందని తెలియడంతో సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో కెరటం అనే సినిమాతో ఆమె పరిచయం అయింది. తమిళంలో దానినే యువన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఆ తర్వాత మరో రెండు తమిళ సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు

  వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో క్రేజ్

  వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో క్రేజ్

  కానీ ఎప్పుడైతే తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ఆయనకు విశేష ఆదరణ లభించింది. ఆ తరువాత లౌక్యం, కరెంట్ తీగ, పండగచేస్కో, కిక్ 2 వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అలా బ్రూస్లీ, నాన్నకుప్రేమతో, సరైనోడు, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్ లాంటి సినిమాలు తెలుగులో చేసి ఆమె స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.

  మన్మధుడు దెబ్బ

  మన్మధుడు దెబ్బ

  అయితే అనూహ్యంగా ఆమె నాగార్జున సరసన మన్మధుడు సీక్వెల్ సినిమాలో నటించడంతో ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.. బాలీవుడ్ లో కొన్ని అవకాశాలు రావడంతో అక్కడ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో బిజీ బిజీగా ఉంది. చివరిగా ఆమె నితిన్ సరసన ఓ సినిమాలో నటించింది. కానీ ఆమెకు ఈ సినిమా హిట్ కాకపోవడంతో మళ్లీ తెలుగులో పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం అనే సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గా నటించింది.

  తమ్ముడు వీడియో

  తమ్ముడు వీడియో

  నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న తరుణంలో తన తమ్ముడు అమ్మను ప్రీత్ సింగ్ ని కూడా హీరోని చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. సినిమా ప్రారంభం అయ్యాక అనుకోని కారణాలతో అది వాయిదా పడింది. అయితే ప్రస్తుతం కరోనా కాలం కావడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా వంటలక్క అవతారమెత్తింది. వంటలక్క అవతారమెత్తడమే కాక ఇంట్లో పాన్ కేక్స్ చేస్తానని అందరికీ చెప్పి వంటగదికెళ్ళింది.

  నా పని ఏమయ్యేదో

  నా పని ఏమయ్యేదో

  అయితే అక్కడికి వెళ్ళాక ఆమె పాన్ కేక్ మాడ్చి వేసి ఆ మాడ్చిన పాన్ కేక్ ను పాన్ నుంచి తప్పించడానికి అనేక తంటాలు పడుతూ ఉంటుంది. ఈ విషయం మొత్తం వీడియో తీసిన ఆమె తమ్ముడు థ్యాంక్ గాడ్ రకుల్ ప్రీత్ సింగ్ పాన్ కేక్ చేస్తానని అంటే నాకు వద్దని చెప్పాను, తింటానని ఉంటే నా పని ఏమయ్యేదో అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక మాడిపోయిన పాన్ కేక్ ను చూపిన రకుల్ ప్రీత్ సింగ్ ఇది ఒక కొత్త ప్రయోగమని దీనిని తీసుకెళ్లి ఫ్రిజ్లో పెట్టి తర్వాత తినొచ్చని చెబుతూ ఆమె ఫ్రిజ్ లో పెట్టడం కూడా వీడియోలో కనిపిస్తోంది.

  English summary
  Rakul Preet Singh's brother Aman Preet singh shared a video clip, wherein Rakul Preet can be seen cooking a dish. While she was trying to make pancakes, she accidentally ended up making a new dish that she called “pancake scramble.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X