For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు డైలాగ్‌తో అదరగొట్టిన మోహన్‌లాల్.. మలయాళ ఆరట్టు టీజర్ వైరల్

    |

    మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ఆరట్టు ట్రైలర్ య్యూటూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తున్నది. ఈ టీజర్ రెండు రోజుల్లోనే 20 లక్షల వ్యూస్ సాధించడం విశేషంగా మారింది. రెండు రోజుల క్రితం రిలీజైన ఆరట్టు టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ బీ దర్శకత్వం వహించగా, సాజీష్ మంజేరీ, ఆర్డీ ఇల్ల్యూమినేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు ఉదయకృష్ణ మాటల రాశారు. రాహుల్ రాజ్ మ్యూజిక్, విజయ్ ఉలగనాథ్ సినిమాటోగ్రఫిని అందించారు.

    ఆరట్టు ట్రైలర్ పూర్తిగా యాక్షన్ పార్ట్‌తో నిండిపోయింది. 50 సెకన్ల నిడివి ఉన్న టీజర్‌లోని యాక్షన్ సీన్లలో మోహన్‌లాల్ విజృంభించారు. మాస్ ఎలిమెంట్లతో మరోసారి లూసిఫర్ సినిమాను తలపించారు.

    ఆరట్టు టీజర్‌లో మోహన్‌లాల్ నోట తెలుగు డైలాగ్స్ పలికించడం హాట్ టాపిక్‌గా మారింది. నేను వాడిని చంపేస్తాను అంటూ మోహన్‌లాల్ చెప్పిన డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా పేలింది. మలయాళ టీజర్‌ మొత్తంలో ఒకే ఒక తెలుగు డైలాగ్ ఉండటం గమనార్హం.

    Mohanlal speaks out Telugu dialogue in Aarattu teaser

    ఆరట్టు చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నెడుముడి వేణు, సాయికుమార్, సిద్దిఖీ, విజయ్ రాఘవన్, ఇంద్రాన్స్, జానీ ఆంటోని, షీలా, రచనా నారాయణ్‌కుట్టి, స్వాసిక తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన థియేటర్లో రిలీజ్ కానున్నది.

    English summary
    Super star Mohanlal's Aarattu teaser goes viral in the youtube. He speaks out Telugu dailogue in teaser become special attraction. This movie is Directed by Unnikrishnan B, produced by Sajeesh Manjeri and RD Illuminations and written by Udayakrishna. Shraddha Srinath is in lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X