For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దీప్తీ సునయన - షణ్ముఖ్ జస్వంత్ పర్సనల్ ఫొటో లీక్: ఒకే బెడ్‌పై అలా కనిపించి షాకిచ్చిన కుర్ర జంట

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తమ టాలెంట్లను బయట పెట్టుకుంటూ ఫేమస్ అవుతున్నారు. అందులో కొందరైతే విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. తద్వారా బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. ఈ జాబితాలోకే వస్తారు దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్. డ్యాన్స్ వీడియోల ద్వారా క్రేజ్‌ను అందుకున్న ఈ జంట.. ప్రేమాయణంతో బాగా హైలైట్ అయింది. ఇక, ఈ మధ్య టీవీ షోలలో సైతం సందడి చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి పర్సనల్ ఫొటో బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  ఇద్దరి కెరీర్ అలాగే ప్రారంభం అయిందిగా

  ఇద్దరి కెరీర్ అలాగే ప్రారంభం అయిందిగా

  సోషల్ మీడియాలో పలు రకాల యాప్‌లలో వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యారు దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ వీడియోలు చేశారు. వాటికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కొన్నింటిలో దీప్తీని లీడ్‌గా పెట్టి.. అతడు వెనకుండి వాటిని నడిపించాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం పెరిగిందన్న విషయం తెలిసిందే.

  ఆమెకు ఆ ఆఫర్... అతడు వాటితో బిజీ

  ఆమెకు ఆ ఆఫర్... అతడు వాటితో బిజీ

  వరుసగా కవర్ సాంగ్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతోన్న సమయంలోనే దీప్తి సునయనకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొద్ది రోజుల పాటు హల్‌చల్ చేసి.. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. దీప్తి హౌస్‌లో ఉన్న సమయంలోనే షణ్ముఖ్ పలు రకాల వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ మరింత ఫేమస్ అయ్యాడు.

  విడిపోయిన జంట.. అతడికి మరొకరితో

  విడిపోయిన జంట.. అతడికి మరొకరితో

  బిగ్ బాస్ సమయంలోనే దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ విడిపోయారని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ షో తర్వాత వీళ్లిద్దరూ కలిసి పని చేయడం కనిపించలేదు. దీంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. అదే సమయంలో షణ్ముఖ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు, దీప్తిని కాదని ఆమెను వివాహం చేసుకోబోతున్నాడని కూడా అన్నారు.

  చాలా రోజుల తర్వాత మళ్లీ కలిశారుగా

  చాలా రోజుల తర్వాత మళ్లీ కలిశారుగా

  చాలా రోజుల పాటు దూరం దూరంగా ఉన్న దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్.. కొద్ది రోజుల క్రితం మళ్లీ కలిశారు. మధ్యలో వచ్చిన మనస్పర్థలను పక్కన పెట్టేసి ఒక్కటైపోయారు. అప్పటి నుంచి తరచూ కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీలు కూడా చేసుకుంటున్నారు. అలాగే, వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

  జంటగా హల్‌చల్.. పెళ్లికి రెడీ అయ్యారు

  జంటగా హల్‌చల్.. పెళ్లికి రెడీ అయ్యారు

  ఇటీవల జరిగిన కొన్ని షోలలో దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ జంటగా దర్శనమిచ్చారు. అదే సమయంలో రొమాంటిక్ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు చేశారు. ఈ క్రమంలోనే తమ మధ్య ఉన్న ప్రేమను ప్రేక్షకుల ముందే వ్యక్త పరచుకున్నారు. అలాగే, ఒకరి పుట్టినరోజులకు ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

  షణ్ముఖ్ కేసు... అండగా నిలబడిన దీప్తీ

  షణ్ముఖ్ కేసు... అండగా నిలబడిన దీప్తీ

  దీప్తి సునయనతో కలిసి తర్వాత షణ్ముఖ్ జస్వంత్ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా వెబ్ సిరీస్‌లు, వీడియోలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల అతడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణం అయ్యాడు. దీంతో ఈ టాలెంటెడ్ గాయ్ అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ సమయంలో దీప్తి సునయననే అతడికి అండగా నిలబడిందన్న విషయం తెలిసిందే.

  దీప్తీ - షణ్ముఖ్ పర్సనల్ ఫొటో బయటకు

  దీప్తీ - షణ్ముఖ్ పర్సనల్ ఫొటో బయటకు

  చాలా కాలం తర్వాత జంటగా మారిన తర్వాత దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ తెగ హల్‌చల్ చేస్తున్నారు. ప్రేమను వ్యక్తపరచుకోవడమే కాదు.. ఎక్కడికెళ్లినా జోడీగానే కనిపిస్తున్నారు. వాటిని వాళ్లే స్వయంగా పోస్టుల రూపంలో చెబుతున్నారు. ఇలాంటి సమయంలో దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ పర్సనల్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

  Sunaina Roshan's Boyfriend Ruhail Amin Breaks His Silence || Filmibeat Telugu
  ఒకే బెడ్‌పై అలా కనిపించిన షాకిచ్చారు

  ఒకే బెడ్‌పై అలా కనిపించిన షాకిచ్చారు

  తాజాగా దీప్తీ సునయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పర్సనల్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షణ్ముఖ్‌తో కలిసి ఒకే బెడ్‌పై కనిపించింది. అతడు కూర్చుని ఏదో తింటుండగా.. ఆమె మాత్రం దానిపై పడుకుని ఉంది. ప్రస్తుతం ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ ఒకే రూంలో.. ఒకే బెడ్‌పై కనిపించడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. దీంతో దీప్తీ.. షణ్ముఖ్ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు.

  English summary
  Deepthi Sunaina and Shanmukh reaffirm their love. New couple on the show are Deepthi Sunaina and Shanmukh Jaswanth who need no introduction as they are the most famous dancing couple on YouTube and other video channels who created storm with their sultry dances. Their dances have become as popular as original ones and received record likes on many channels taking their popularity
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X