For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొత్తానికి ముహూర్తం ఫిక్స్.. గుత్తా జ్వాల-విష్ణు విశాల్ పెళ్లి ఎప్పుడంటే?

    |

    గుత్తా జ్వాలా విష్ణు విశాల్ ప్రేమ కహాని ముగిసి పెళ్లి బంధానికి అడుగులు పడుతున్నాయి. ఇన్నాళ్లూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి విషయంలో దోబూచులాటలు ఆడిన ఈ జంట మొత్తానికి నోరు విప్పింది. ఇద్దరి గతంలోనూ మొదటి వివాహాం కలిసి రాకపోయినా కూడా ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట తమ పెళ్లిపై ప్రకటన చేసింది.

    బికినీ అందాలతో మత్తెక్కిస్తోన్న ఇషా ఛబ్రా

     ఇద్దరి గతం అలానే..

    ఇద్దరి గతం అలానే..

    జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ జీవితంలోనూ మొదటి పెళ్లి కలిసి రాలేదు. జ్వాల గతంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయింది. ఇటు హీరో విష్ణు విశాల్‌ కు కూడా రజనీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. కానీ వీళ్లు కూడా విడిపోయారు. ఇప్పుడు జ్వాలా గుత్తా విష్ణు విశాల్ ఏకమయ్యే తరుణం ఆసన్నమైంది.

    గతేడాది అలా..

    గతేడాది అలా..

    గత ఏడాది సెప్టెంబర్‌లో వీర కహాని బయటకువచ్చింది. విష్ణు విశాల్ తన ప్రేయసి జ్వాలా గుత్తాకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఓ రింగ్ తొడిగేశాడు. అలా ఈ ఇద్దరూ తమకు నిశ్చితార్థం అయిన విషయాన్ని ప్రకటించేశారు.

     స్పెషల్ పిక్స్..

    స్పెషల్ పిక్స్..

    అలా అప్పటి నుంచి ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ప్రారంభించారు. విష్ణు విశాల్ బర్త్ డే సందర్బంగా హైద్రాబాద్ నుంచి చెన్నైకి కారు నడుపుకుంటూ వెళ్లి మరీ సర్ ప్రైజ్ ఇచ్చింది. బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి పెళ్లిపై ప్రకటన చేశారు.

     ఎంతో సంతోషంగా..

    ఎంతో సంతోషంగా..

    త‌మ కుటుంబ స‌భ్యుల ఆశీర్వాదాల‌తో తాము పెళ్లి చేసుకోబోతున్నామ‌ని, ఈ విష‌యాన్ని అంబ‌రాన్నంటే సంతోషంతో ప్ర‌క‌టిస్తున్నామ‌ని చెప్పారు. త‌మ కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ నెల 22న త‌మ‌ పెళ్లి జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఇన్నేళ్లుగా త‌మ‌పై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు ఇరువురూ సంయుక్తంగా ప్ర‌క‌ట‌న చేశారు.

    English summary
    Jwala Gutta Vishnu Vishal Announces Marriage Date,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X