For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating: 2.5/5

  నటీనటులు: కీర్తి చావ్లా, సాధికా, ఆదీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు, నీళగల్ రవి, రవళి తదితరులు

  డైరెక్టర్: జీ సురేందర్ రెడ్డి

  నిర్మాతలు: ఏబి.శ్రీనివాస్, ఆర్ సుందర్, శ్రీధర్ పోతూరి, శాఖముద్ర శ్రీధర్

  ఎడిటర్ :- మేనగ శ్రీను

  బ్యానర్: చిన్నా ప్రొడక్షన్స్

  మధ్య తరగతికి చెందిన రామచంద్ర (అదీ ప్రేమ్) దంపతుల కుమారుడైన ఆనంద్ (శ్రీమాన్)కు అదే గ్రామానికి చెందిన యువతి (కీర్తి చావ్లా)తో వివాహం జరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కాపురం ఆగిపోతుంది. తండ్రి చేసిన అప్పులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉద్యోగం కోసం పట్నం చేరుతాడు. పట్నంలో అడుగుపెట్టిన ఆనంద్‌కు రూ.5 లక్షల బ్యాగ్ దొరుకుతుంది. ఓ కార్ల కంపెనీకి చెందిన డబ్బు అని తెలుసుకొని వారికి అందజేస్తాడు. ఆనంద్ నిజాయితీ చూసి కార్ల కంపెనీ యజమాని (సాధిక) ఆనంద్‌కు ఉద్యోగం ఇస్తుంది. అంతేకాకుండా అప్పు తీర్చడానికి ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ క్రమంలో సాధికకు ఆనంద్ దగ్గరవుతాడు. ఆనంద్ కోరిక మేరకు పట్నం వచ్చిన భార్య తన భర్త, యజమానితో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కార్ల కంపెనీ ఓనర్ సాధిక, మేనేజర్ హత్యకు గురవుతారు. ఆ కేసులో ఆనంద్‌ను అనుమానితుడిగా పోలీసులు అరెస్ట్ చేస్తారు.

  తన యజమాని హత్య ఎలా హత్యకు గురైంది? అలాగే కార్ల కంపెనీలో పనిచేసే అకౌంట్ మేనేజర్ హత్య ఎలా జరిగింది? వీరిద్దరిని హత్య వెనుక హంతకులు ఎవరు? ఆనంద్ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? ఈ కథలో ఆనంద్ భార్య పాత్ర ఏమిటి? అనేక మలుపులు, పశ్నలకు సరైన సమాధానమే ఓ అమ్మాయి క్రైమ్ స్టోరి కథ.

   O Ammayi Crime story movie Review and Rating

  కుటుంబ విలువలతోపాటు వివాహేతర సంబంధం అనే అంశాన్ని జోడించిన చేసిన చిత్రమిది. పాయింట్ ఆసక్తికరమైనప్పటికీ.. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే డెఫినెట్‌గా మంచి సస్పెన్స్ థిల్లర్ అయి ఉండేది. దర్శకుడు జీ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఫీల్‌గుడ్‌గా, ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు ఇంటర్వెల్‌లో ట్విస్టు, సెకండాఫ్‌లో మలుపులు మరింత ఆసక్తిని కలిగిస్తాయి.

   O Ammayi Crime story movie Review and Rating

  ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ సినిమాలో పాత్రల విషయానికి వస్తే.. చాలా రోజుల తర్వాత కీర్తి చావ్లా మరోసారి తన పాత్రదైన శైలిలో ఆకట్టుకొన్నది. గ్లామర్‌పరంగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. సాధిక తన పాత్రకు న్యాయం చేసింది. ఇక మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. రవళి, నిళగల్ రవి ఆకట్టుకొన్నారు.

   O Ammayi Crime story movie Review and Rating

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ చిత్రంలో కథ, కథనాలకు తగినట్టుగా పాటలు, రీరికార్డింగ్ బాగున్నాయి. బీజీఎం కొన్ని సన్నివేశాలను హైలెట్ చేసింది. ఎడిటర్ మేనగ శ్రీను ఎడిటింగ్ బాగుంది. కథను, సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ ఎలివేట్ చేశారు. నిర్మాతలు ఏబి శ్రీనివాస్, ఆర్ సుందర్, శ్రీధర్ పోతూరి, శాఖముద్ర శ్రీధర్ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా నిర్మించారు. ఓవరాల్‌గా ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ చిత్రాన్ని చూస్తున్నంత సేపు చక్కటి థ్రిల్లర్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. క్రైమ్ స్టోరీస్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

  English summary
  Ammayi Crime story Review: Actress Keerthi Chawla reentry in tollywood with O Ammayi Crime story movie. This movie is set to release on April 30th in theatres. This film directed by G Surender Reddy. Produced by AB Srinivas, R Sunder, Sridhar Pothuri, Shakamudra Sridhar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X