For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్: తారక్ రికార్డు బద్దలు.. బాలయ్య నుంచి పొంచిన ప్రమాదం!

  |

  కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోల మధ్య స్నేహపూర్వక పోటీ కనిపిస్తోంది. ఫ్యాన్ బేస్‌ను బట్టి ఆయా స్టార్లు సోషల్ మీడియాలో ట్రెండ్‌ను సెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఏ ఇండస్ట్రీలోనూ కనిపించని రికార్డులు మన టాలీవుడ్‌లో నమోదు అవుతున్నాయి. అదే సమయంలో టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్ ఇలా ఎన్నో రకాలుగా హీరోలు పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ను వెనక్కి నెట్టేసి తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన రికార్డును నమోదు చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కానీ, అతడికి బాలయ్య రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఆ వివరాలు మీకోసం!

  మొదటిసారి ఘాటుగా దర్శనమిచ్చిన శివాత్మిక రాజశేఖర్

  పుష్ప రాజ్‌గా మారిపోయిన అల్లు అర్జున్

  పుష్ప రాజ్‌గా మారిపోయిన అల్లు అర్జున్

  ‘అల.. వైకుంఠపురములో' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌తో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందుతోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

  అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా టీజర్

  అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా టీజర్

  అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా ఒకరోజు ముందే ‘Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన ఏకైక టీజర్‌గా ఈ వీడియో నిలిచింది.

  ఆ మైలురాయిని చేరుకున్న పుష్ప రాజ్

  ఆ మైలురాయిని చేరుకున్న పుష్ప రాజ్

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ వచ్చిన టీజర్లలో యాభై మిలియన్ మార్కును చేరుకున్నది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. RRRలోని రామరాజు ఫర్ భీం వీడియోనే తొలిసారి ఈ మైలురాయిని చేరుకుంది. రెండు రోజుల క్రితం ఆ మైలురాయిని ‘పుష్ప' మూవీ టీజర్ కూడా చేరింది. అయితే, ఇది ఎన్టీఆర్ వీడియో కంటే వేగంగా ఈ మార్కును అందుకోవడం గమనార్హం.

  టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

  టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

  అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప మూవీలోని ‘Introducing Pushpa Raj' టీజర్ తాజాగా 53 మిలియన్ మార్కును దాటేసింది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా ఇది రికార్డును క్రియేట్ చేసింది. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ రామరాజు ఫర్ భీం (50 మిలియన్ వ్యూస్)ను వెనక్కి నెట్టేసింది. దీంతో బన్నీ టాలీవుడ్‌లో చరిత్రను సృష్టించాడు.

  మూడో స్థానంలో బాలకృష్ణ అఖండ టీజర్

  మూడో స్థానంలో బాలకృష్ణ అఖండ టీజర్

  తాజా రిపోర్టులు ప్రకారం.. అల్లు అర్జున్ ‘పుష్ప' టీజర్ ఎక్కువ వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్ రామరాజు ఫర్ భీం యాభై మిలియన్ మార్కును దాటేసి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక, నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అఖండ' టీజర్ ఏకంగా 47 పైచిలుకు వ్యూస్‌ను అందుకుని మూడో స్థానంలో ఉంది.

  Allu Arjun Tests COVID-Positive, In Home Quarantine | Filmibeat telugu
  బాలయ్య నుంచి బన్నీకి పొంచిన ప్రమాదం

  బాలయ్య నుంచి బన్నీకి పొంచిన ప్రమాదం

  టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ వచ్చిన టీజర్లలో బాలకృష్ణ ‘అఖండ'కు మాత్రమే అత్యంత భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అందుకే ఇది వేగంగా 47 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడిదే దూకుడు ప్రదర్శిస్తే.. మరో రెండు మూడు రోజుల్లో బన్నీ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కూడా ఉంది. అంతకంటే ముందే అబ్బాయిని కూడా దాటేయడానికి రెడీగా ఉన్నాడు బాబాయ్.

  English summary
  Pushpa is an upcoming Indian Telugu-language action thriller film written and directed by Sukumar with Allu Arjun, Vijay Sethupathi, Rashmika Mandanna, Prakash Raj and Jagapati Babu in lead roles, while Harish Uthaman, Vennela Kishore and Anasuya Bharadwaj in supporting roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X