For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Ajith Kumar: అలాంటి పని నుంచి టాప్ హీరోగా.. ఇండియాలోనే ఏకైక స్టార్‌గా రికార్డు

  |

  తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. సుదీర్ఘ కాలంగా తన హవాను చూపిస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు తలా అజిత్ కుమార్. స్టైలిష్ లుక్, విలక్షణమైన నటనతో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. దక్షిణాది మొత్తం హవాను చూపిస్తున్నాడు. ఇక, జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. సినిమాల పరంగానే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈరోజు అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం!

   మెకానిక్‌ నుంచి టాప్ రేసర్‌గా ఎదిగి

  మెకానిక్‌ నుంచి టాప్ రేసర్‌గా ఎదిగి

  హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అజిత్ కుమార్.. రేసర్‌గా రాణించాలని డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. అదే సమయంలో మెకానిక్‌గానూ పని చేశాడు. ఆ సమయంలోనే బ్రిటీష్ ఫార్ములా వన్ రేస్‌లో మూడో స్థానం సంపాదించి గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత మోడల్‌గానూ మారి సత్తా చాటాడు. ఇలా రేసర్‌గా గెలిచిన ఏకైక ఇండియన్ హీరో అజిత్ కుమారే కావడం విశేషం.

   తమిళ చిత్రంతో పరిచయం.. తెలుగులో

  తమిళ చిత్రంతో పరిచయం.. తెలుగులో

  మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలో అజిత్ కుమార్‌కు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ‘ఎన్ వీరు ఎన్ కడవార్' అనే సినిమాతో నటుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత ‘ప్రేమ పుస్తకం' అనే తెలుగు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.

  ఆ హీరోయిన్‌తో ప్రేమాయణం.. వివాహం

  ఆ హీరోయిన్‌తో ప్రేమాయణం.. వివాహం

  హీరోగా ఫుల్ బిజీగా ఉన్నప్పుడే అప్పటి హీరోయిన్ షాలినీతో ప్రేమలో పడ్డాడు అజిత్. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇలా 2000వ సంవత్సరంలో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి షాలినీ సినిమాలకు దూరం అయ్యారు. అజిత్ మాత్రం స్టార్ హీరోగా ఎదిగిపోయి వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

  కోట్ల మంది ఫ్యాన్స్... నిత్యం గొడవలతో

  కోట్ల మంది ఫ్యాన్స్... నిత్యం గొడవలతో

  దక్షిణాదిలో ఎక్కువ మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకడు. ఆయనకు ఇండియాలోనే కాక.. మలేషియా, జపాన్, దుబాయ్ తదితర దేశాల్లోనూ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అతడికి సంబంధించి ప్రతి విషయాన్ని వాళ్లు హైలైట్ చేస్తుంటారు. అదే సమయంలో తరచూ ఏదో ఒక విషయంలో గొడవలకు దిగుతుంటారు. దీనిపై అజిత్ కూడా సీరియస్ అయ్యాడు.

  మైనస్‌నే ప్లస్‌గా మార్చుకున్న హీరో

  మైనస్‌నే ప్లస్‌గా మార్చుకున్న హీరో

  ఈరోజుల్లో జుట్టు తెల్లబడడం సర్వసాధారణమైన విషయం. కానీ, హీరోలకు అలా ఉంటే కుదరదు. అందుకే చాలా మంది కలర్ వేసుకుంటూ ఉంటారు. కానీ, అజిత్ మాత్రం తెల్ల జుట్టుతోనే కనిపిస్తూ.. దాన్నే కొత్త స్టైల్‌గా మార్చేశాడు. అదే సమయంలో సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. అలాగే, అతడి ప్రధాన బలం విలక్షణ నటనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  ఫ్లాపుల పరంపరకు బ్రేక్ పడింది అలా

  ఫ్లాపుల పరంపరకు బ్రేక్ పడింది అలా

  ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన అజిత్.. ఈ మధ్య కాలంలో చాలా పరాజయాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో అతడి కెరీర్‌పై చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. బాలీవుడ్ మూవీ ‘పింక్'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే.

  Prabhas 24 కి అంతా సిద్ధం, Radhe Shyam పై Prabhas స్పెషల్ కేర్!!
  ఇప్పుడు ‘వాలిమై' అని వస్తున్నాడుగా

  ఇప్పుడు ‘వాలిమై' అని వస్తున్నాడుగా

  ప్రస్తుతం అజిత్ కుమార్ ‘వాలిమై' అనే సినిమాలో నటిస్తున్నాడు. హెచ్ వినోద్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అతడు బైక్ రేసర్‌గా, మధ్య వయస్కుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు హీరో కార్తికేయ విలన్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోన్న అజిత్‌కు ఫిల్మీ బీట్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

  English summary
  Ajith Kumar is an Indian film actor who works mainly in Tamil cinema. Apart from a small role in the 1990 Tamil film En Veedu En Kanavar his professional career began three years later with his debut as a lead actor in Tamil cinema with Amaravathi. Despite being a moderate success, the film helped him obtain more modelling assignments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X