For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ ఆగిపోడానికి కారణమిదే: ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫైనెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుని.. చాలా కాలంగా తన హవాను చూపిస్తున్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతోన్న అతడు.. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయిపోయాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేశాడు. తాజాగా ఈ ప్రాజెక్టు ఆగిపోడానికి అసలు కారణం తెలిసింది. ఆ సంగతులు మీకోసం!

  హాట్ బికినీ ఫోజులతో రెచ్చగొడుతోన్న హీరోయిన్ శ్రద్దా దాస్

  జూనియర్ ఎన్టీఆర్‌ చేసిందల్లా హిట్టే

  జూనియర్ ఎన్టీఆర్‌ చేసిందల్లా హిట్టే

  ఆ మధ్య కాలంలో వరుస పరాజయాలతో తెగ ఇబ్బందులు పడ్డాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అయితే, పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘టెంపర్' నుంచి అతడు మరోసారి విజయ పరంపరను అందుకున్నాడు. ఆ మూవీ నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు.

   ప్రతిష్టాత్మక చిత్రంలో మెగా హీరోతో

  ప్రతిష్టాత్మక చిత్రంలో మెగా హీరోతో

  ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరిలా, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తున్నారు.

   ఆయనతో సినిమాను ప్రకటించాడు

  ఆయనతో సినిమాను ప్రకటించాడు

  ‘అరవింద సమేత' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై కల్యాణ్ రామ్, రాధాకృష్ణ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇది పొలిటికల్ నేపథ్యంతో వస్తుందని.. అందుకే ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెట్టారని అన్నారు.

  చాలా కాలం తర్వాత ఆగిపోయింది

  చాలా కాలం తర్వాత ఆగిపోయింది

  ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో రానున్న రెండో సినిమాకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడింది. కానీ, ఆ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభించలేదు. ఇలాంటి సమయంలో దీని గురించి నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చూశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రకటనకే పరిమితమైపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆగిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు.

  ఎన్టీఆర్ అలా.. త్రివిక్రమ్ ఇలా ఫిక్స్

  ఎన్టీఆర్ అలా.. త్రివిక్రమ్ ఇలా ఫిక్స్

  ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిన నేపథ్యంలో వీళ్లిద్దరూ వేరు వేరుగా ప్రాజెక్టులను ప్రకటించారు. యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని ‘జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్‌ను అందించిన కొరటాల శివతో చేయబోతున్నాడు. మరోవైపు.. త్రివిక్రమ్ మాత్రం తన తర్వాతి సినిమాను మహేశ్‌ బాబుతో చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలూ వచ్చే సమ్మర్‌లో రాబోతున్నాయని కూడా ప్రకటించారు.

  వాళ్ల మూవీ ఆగిపోడానికి కారణమిదే

  వాళ్ల మూవీ ఆగిపోడానికి కారణమిదే

  జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ప్లాన్ చేసుకున్న సినిమా ఎందుకు ఆగిపోయిందని అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య స్క్రిప్ట్ విషయంలో సయోధ్య కుదరలేదట. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఈ సినిమా పట్టాలెక్కలేదని తెలుస్తోంది.

  RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
  వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే

  వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే

  సినిమా ఆగిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య విభేదాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. అయితే, వాళ్ల సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేవని తెలిసింది. ఇప్పటికీ ఇద్దరూ టచ్‌లోనే ఉన్నారని అంటున్నారు. కరోనా వచ్చిన సమయంలోనూ గురూజీ.. తారక్‌కు ఫోన్ కూడా చేశాడని తెలిసింది.

  English summary
  Recently Tollywood Star Hero Young Tiger Jr NTR Trivikram Srinivas Movie Stopped. Now This Project Cancelled Reason Was Revealed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X