For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను చూసిన 'రాణి' నువ్వే.. ఆ ఫోటోలు షేర్ చేసి.. మోనాల్ బర్త్‌డేకి అఖిల్ ఎమోషనల్ విషెస్!

  |

  2012లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సుడిగాడు సినిమాతో గుజరాతి భామ మోనాల్ గజ్జర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత వివిధ భాషలలో దాదాపు డజను సినిమాలు చేసినా సరే ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఎప్పుడైతే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఈ భామ ఎంట్రీ ఇచ్చిందో అప్పుడు ఈ భామకు ఎనలేని క్రేజ్ లభించింది.. హౌస్ లోపల మరో కంటెస్టెంట్ అయిన అఖిల్ తో ప్రేమాయణం ఈ భామ క్రేజ్ ని రెండింతలు చేసిందని చెప్పొచ్చు.. బయటకు తామిద్దరం మంచి స్నేహితులం అని చెబుతున్నా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈరోజు మోనాల్ గజ్జర్ పుట్టినరోజు కావడంతో అఖిల్ ఆమెకు విషెస్ తెలిపాడు.. ఆ వివరాల్లోకి వెళితే

  హీరోయిన్ గా ఎంట్రీ

  హీరోయిన్ గా ఎంట్రీ

  సుడిగాడు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గుజరాతి భామ ఆ తర్వాత తెలుగులో వెన్నెల వన్ అండ్ హాఫ్, ఒక కాలేజీ స్టోరీ, బ్రదర్ అఫ్ బొమ్మాలి, దేవదాసి లాంటి సినిమాల్లో నటించింది.. ఈ మధ్యలో తమిళ, మలయాళ, గుజరాతి సినిమాల్లో కూడా ఆమె నటించింది. కానీ ఎన్ని సినిమాల్లో నటించినా సరే ఆమెకు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎనలేని క్రేజ్ సంపాదించి పెట్టింది. ఈ షోతో వచ్చిన క్రేజ్ కారణంగా ఆమెకు వెంటనే ఒక ఐటెం సాంగ్ ఆఫర్ కూడా వచ్చింది.

  టెలివిజన్ లో బిజీ

  టెలివిజన్ లో బిజీ

  అయితే సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినా చేయకూడదు చేస్తే మంచి గుర్తింపు ఉన్న సినిమాలు చేయాలని భావిస్తున్న ఈ భామ ఇప్పుడు టెలివిజన్ లో ప్రసారం అవుతున్న డాన్స్ ప్లస్ ప్లస్ అనే ఒక షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షో ద్వారా ఆమె మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది. ఓంకార్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ షోలో ఆమె యష్ మాస్టర్ తో జత కట్టినట్లుగా ప్రేక్షకులను భ్రమింపచేస్తూ టీఆర్పీ పెంచుకునే పనిలో పడ్డారు నిర్వాహకులు..

  వీళ్లు వేరే

  వీళ్లు వేరే

  ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్లో ఒక జంట ను తయారుచేయడం నిర్వాహకులకు కొత్తేమీ కాదు. హౌస్ లో ఉన్నప్పుడు ఒకరినొకరు విడవకుండా ఉండే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ఉంటారు. కానీ గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్లో ప్రేమ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ మోనాల్ గజ్జర్ ఎక్కువగా బయట కూడా కలుస్తూ అందరిలోనూ అనుమానాలు రేపుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం పైకి స్నేహితులు అని చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు పెళ్లి, ప్రేమ అనే పదాలు వాడుతూ ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు.

  నేను చూసిన రాణి నువ్వే

  నేను చూసిన రాణి నువ్వే

  ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు మోనాల్ గజ్జర్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ సందర్భంగా అఖిల్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.. తాను రాణులకు సంబంధించి చాలా కథలు విన్నాను కానీ నిజ జీవితంలో చూసిన రాణివి మాత్రం నువ్వే అని చెప్పుకొచ్చాడు అఖిల్. నీ గురించి చెప్పడానికి ఇవి చిన్న పదాలే అయినా ఇంతకుమించి ఎలా అభివర్ణించాడు తనకు తెలియడం లేదని చెప్పుకొచ్చాడు..అలాగే తనకు ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేసిన బిగ్ బాస్ కి కూడా అఖిల్ థాంక్స్ చెప్పాడు.

  Mahesh Babu కటౌట్ లకి పాలాభిషేకం చేస్తున్న Naga Chaitanya | Thank You Movie

  నేనున్నా

  అలాగే భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్న మళ్ళీ చివరికి చాలా చాలా అయిపోయింది ఇక పై నుంచి కిందకి దిగి వచ్చే అంటూ మళ్ళీ సరదాగా కామెంట్ చేశాడు. అయితే తాను ఎల్లప్పుడూ నీ వెంట ఉంటాం అని పేర్కొన్న అఖిల్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా ఉంటానని అభయం ఇచ్చాడు. ప్రేమతో జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ అంటూ ఆయన ముగించాడు. అన్నట్టు వీరిద్దరూ కలిసి గుజరాతి అమ్మాయి తెలుగు అబ్బాయి పేరుతో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.

  English summary
  Actress Monal Gajjar of Bigg Boss Telugu 4 fame turned a year older today. Her rumoured boy friend Akhil Sarthak took to his Instagram handle to wish Monal on her birthday with a lengthy and emotional post.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X