For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆరియానా గ్లోరీ పెళ్లిపై సెన్సేషనల్ న్యూస్: ఆ అబ్బాయితోనే ఏడడుగులు.. దీని వెనుక సీక్రెట్ ఏమిటంటే!

  |

  బిగ్ బాస్ షో ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకూ తెలుగులో నాలుగు సీజన్లు పూర్తవగా.. వాటిలో కంటెస్టెంట్లుగా చేసిన ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో బోల్డ్ పాప ఆరియానా గ్లోరీ ఒకరు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయింది. ఇక, బిగ్ బాస్ షో తర్వాత మరింత ఫేమస్ అయింది. దీంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆరియానా పెళ్లికి సిద్ధం అయిందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులు మీకోసం!

  రాంగోపాల్ వర్మ వల్లే.. ఆరియానా ఫేమస్

  రాంగోపాల్ వర్మ వల్లే.. ఆరియానా ఫేమస్

  యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే సినీ తారలతో ఇంటర్వ్యూలు చేయడంతో బాగా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో కూడా చిట్‌చాట్ చేసింది. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య బోల్డ్ ఇంటర్వ్యూ జరిగింది. దీనికితోడు ఈమె గురించి వర్మ హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆరియానా ఫేమస్ అయిపోయింది.

  బిగ్ బాస్‌లో బోల్డ్ పాపకు భలే కుదిరింది

  బిగ్ బాస్‌లో బోల్డ్ పాపకు భలే కుదిరింది

  రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఆరియానా గ్లోరీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. సీక్రెట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అద్భుతమైన ఆటతో పాటు ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మనసు దోచుకుంది. తద్వారా ఎలిమినేషన్స్ తప్పించుకుని గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టింది.

  అతడితో లవ్ ట్రాక్.. మొత్తం రివీల్ చేసింది

  అతడితో లవ్ ట్రాక్.. మొత్తం రివీల్ చేసింది

  బిగ్ బాస్ హౌస్‌లో ఆట పరంగా ఎంత సీరియస్‌గా ఉందో.. ముక్కు అవినాష్‌తో అంత ఫన్నీగా గడిపింది ఆరియానా. దీంతో వాళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ వినిపించింది. ఆ సమయంలోనే ఆమె.. తనకు వేరే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. అదే సమయంలో తన పెళ్లి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె చాలా రోజులు హాట్ టాపిక్ అయింది.

  వరుస ఆఫర్లతో బిజీ.. స్వింగ్‌లో ఆరియానా

  వరుస ఆఫర్లతో బిజీ.. స్వింగ్‌లో ఆరియానా

  నిజానికి ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన సమయంలో ఎవరికీ ఆమెపై అంచనాలు లేవు. కానీ, ఫినాలేలో నాలుగో స్థానం వరకూ వచ్చింది. అదే సమయంలో క్రేజ్ కూడా భారీగా పెరిగింది. తద్వారా ఆమె వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌, కల్యాణ్ దేవ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. మరికొన్నింటికి సంతకాలు కూడా చేసేసి స్వింగ్‌లో కనిపిస్తోంది.

  తన వివాహం గురించి అప్పుడలా కామెంట్స్

  తన వివాహం గురించి అప్పుడలా కామెంట్స్

  బిగ్ బాస్ షో తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆరియానా గ్లోరీ ‘నేను ఏడాదిన్నరలో పెళ్లి చేసుకుంటా. బిగ్ బాస్‌కు ముందే ఓ ఎన్నారై సంబంధం వచ్చింది. అది ఇంకా చర్చల దశలోనే ఉంది. నా కెరీర్ కోసమే దాన్ని హోల్డులో పెట్టాను' అని చెప్పింది. అంతేకాదు, తనకు ముగ్గురు పిల్లలు పుట్టాలనుకుంటున్నట్లు, అందులో కవలలు కూడా ఉండాలని ఆమె తన కోరికను వెల్లడించింది.

  ఆరియానా గ్లోరీ పెళ్లిపై సెన్సేషనల్ న్యూస్

  ఆరియానా గ్లోరీ పెళ్లిపై సెన్సేషనల్ న్యూస్

  వరుస ఆఫర్లు అందుకుంటూ అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై సందడి చేస్తోన్న ఆరియానా గ్లోరీ పెళ్లి గురించి తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. అది కూడా పెద్దలు కుదిర్చిన అబ్బాయినే అని తెలిసింది. దీంతో గతంలో చెప్పిన ఎన్నారై కుర్రాడితోనే ఈ బోల్డ్ బ్యూటీ ఏడడుగులు వేయబోతుందని ప్రచారం జరుగుతోంది.

  Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Filmibeat Telugu
  ఆరియానా పెళ్లి వెనుక సీక్రెట్ ఏమిటంటే!

  ఆరియానా పెళ్లి వెనుక సీక్రెట్ ఏమిటంటే!

  తాజాగా ఆరియానా గ్లోరీ ఓ యాడ్ కోసం పెళ్లి కూతురి గెటప్‌తో ఫొటోషూట్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసిన వారే ఆమె పెళ్లికి సిద్ధమైందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆరియానా ప్రస్తుతం చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. మరిన్ని అవకాశాలు అందుకుంటోంది. సో.. ఇప్పట్లో ఆమె పెళ్లి చేసుకోబోదని విశ్వసనీయంగా తెలిసింది.

  English summary
  Ariyana Gloryis a well-known South Indian TV anchor and actor. She started her career as an anchor at ‘Studio One’ in Hyderabad in 2015, and later, she started working at Sun TV Network Limited, Hyderabad as a TV anchor in 2016.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X