For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ అనసూయ ఇంటిని ఎప్పుడైనా చూశారా.. వీడియోలో అలా దొరికేసింది!

  |

  యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు ఏమో. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమై ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తున్న అనసూయ లేటు వయసులో ఘాటు అందాలు ఆరబోస్తూ ఎక్కువగా ఫేమస్ అయింది.. యాంకర్ అంటే పద్ధతిగా చీర కట్టుకుని ఉండడమే కాదు పొట్టి బట్టలు వేసుకున్నా జనాలు ఆదరిస్తారని చాటి చెబుతూ టెలివిజన్ యాంకరింగ్ ఫీల్డ్ గ్లామర్ అద్దిన అతి కొద్దిమంది యాంకర్లలో ఈమె కూడా ఒకరు.. ఎప్పుడూ ఏదో ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూనో లేదా ఫోటో షూట్ లు అప్లోడ్ చేస్తునో ఈ భామ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తాజాగా ఈ భామ ఇల్లు అనుకోకుండా ఒక వీడియోలో దర్శనం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్

  జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్

  జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ యాంకర్ గా చాలా క్రేజ్ తెచ్చుకుంది.. ఒకానొక సమయంలో గురువారం వస్తుందంటే అనసూయని చూడడానికి సైతం చాలామంది జబర్దస్త్ ప్రోగ్రాం చూసే వాళ్ళు అంటే అతిశయోక్తి కాదు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సరే తన అందంతో ఆమె కుర్రాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈమెకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ ను వాడుకోవడానికి ఎప్పటికప్పుడు సినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తూనే ఉంటారు. అందుకే ఆమెతో సినిమాలు చేయాలని కొంతమంది భావిస్తుంటే చిన్న పాత్ర అయినా సరే తమ సినిమాల్లో నటింపజేయాలని మరికొందరు భావిస్తూ ఉంటారు..

  రంగమ్మత్త మ్యాజిక్

  రంగమ్మత్త మ్యాజిక్

  రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రిలీజైన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమె మరింత క్రేజ్ సంపాదించింది. భర్తను కోల్పోయినా ఏ మాత్రం ఆ విషయం బయటపడకుండా అందరితో కలుపుగోలుగా ఉండే పాత్రలో నటించి చివర్లో ఏడిపించేసింది. అంత టాలెంట్ ఉంది కాబట్టే అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఆమె వయసుకు తగ్గ రోల్స్ ఇస్తూ నిర్మాతలు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు.

  ఐటెం సాంగ్స్ సైతం

  ఐటెం సాంగ్స్ సైతం

  అయితే గతంలో తాను ఐటెం సాంగ్స్ చేయను అని చెప్పిన ఈ భామ చావు కబురు చల్లగా అనే సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఆ పాటలో ఉన్న అర్థం వచ్చి తాను సాంగ్ చేశానని ఈ భామ చెప్పుకొచ్చింది. నిజానికి ఆమెను పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో పార్టీ సాంగ్ కోసం అడిగారట. కానీ ముగ్గురిలో ఒకరికి చేయడం తనకు నచ్చదని తన ఒక్క దానికి అవకాశం ఉంటే చేస్తానని ఆ అవకాశాన్ని వదులుకున్నానని గతంలో చెప్పుకొచ్చింది.

  థాంక్యూ బ్రదర్ అంటూ

  థాంక్యూ బ్రదర్ అంటూ

  ఇప్పుడు అసలు విషయానికి వస్తే అనసూయ లీడ్ రోల్లో నటించిన థాంక్యూ బ్రదర్ అనే సినిమా మరికొద్ది రోజుల్లో ఆహా వేదికగా రిలీజ్ కాబోతోంది. రమేష్ రాపర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మాగుంట శరత్ చంద్ర రెడ్డి, బొమ్మిరెడ్డి తారక్ నాథ్ నిర్మించారు. ఒక యువకుడు, గర్భవతి అయిన ఒక మహిళ అనుకోకుండా లిఫ్ట్ లో ఇరుక్కుంటారు. లిఫ్ట్ నుంచి ఎలా బయటపడ్డారు అనే అంశం మీద ఈ సినిమా రూపొందింది. థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్న ప్రస్తుతానికి థియేటర్ రిలీజ్ లేదు కాబట్టి ఆహా లో రిలీజ్ చేస్తున్నారు.

  యూట్యూబర్ వీడియోలో

  ప్రస్తుతానికి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అనసూయ అనేక ఛానళ్లకు, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తోంది. అందులో భాగంగా ఒక ప్రముఖ యూట్యూబర్ ఆమె వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన ఆమె ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అనసూయ ఇల్లు బయటి నుండి ఎలా ఉంటుందో రివీల్ అయింది. దీంతో తమ అభిమాన యాంకర్ ఇల్లు ఇదేనంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

  English summary
  Telugu anchor turned actress Anasuya Bharadwaj’s upcoming film ‘Thank You Brother’ is all set to have a digital release. It was first meant to release in theatres on April 30 and to premiere on OTT in late May. But due to the situation changing shutdown of theatres in Telangana, the moviemakers have decided to release it directly on Aha on May 7. Actress in now busy with her promotions for the movie, recently a youtuber in his instagram revealed anasuya's house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X