For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రష్మీతో ఆ కోరిక అని రెచ్చిపోయిన ఆది: మంచం చూపిస్తూ.. నువ్వు వంగలేవు.. నేనేమో అంటూ బూతులు

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో నెంబర్ వన్‌ ప్లేస్‌లో వెలుగొందుతోంది జబర్ధస్త్. ఈ షో ఇంతగా సక్సెస్ అవడానికి కమెడియన్లు చేస్తున్న స్కిట్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎంతో మంది టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు ఉన్నా.. వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. అందులో హైపర్ ఆది ఒకడు. చాలా కాలంగా ఈ షో విజయంలో భాగం అవుతోన్న అతడు.. అదిరిపోయే పంచులతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆది.. యాంకర్ రష్మీ గౌతమ్‌తో కోరికను తీర్చుకున్నాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  అలా ఎంట్రీ ఇచ్చి.. ఇలా ఎదిగిపోయాడు

  అలా ఎంట్రీ ఇచ్చి.. ఇలా ఎదిగిపోయాడు

  సినిమాల మీద ఉన్న పిచ్చితో డబ్‌స్మాష్ వీడియోలు, యూట్యూబ్‌లో సినిమా స్ఫూఫ్‌లు చేసుకుంటూ ఉండేవాడు ఆది. అలా అప్పట్లో గుర్తింపును అందుకున్నాడు. ఆ సమయంలోనే అదిరే అభి సహాయంతో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన అతడు.. ఆ తర్వాత ఆర్టిస్టుగానూ మెప్పించాడు. దీంతో హైపర్ ఆదిగా మార్చి ప్రమోషన్ ఇచ్చారు నిర్వహకులు.

   అతడి కోసమే జబర్ధస్త్ చూసేలా చేశాడు

  అతడి కోసమే జబర్ధస్త్ చూసేలా చేశాడు

  జబర్ధస్త్ షో దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రసారం అవుతోంది. ఇందులో ఎంతో మంది కమెడియన్లు తమదైన శైలి టైమింగ్‌తో సందడి చేస్తూ వచ్చారు. అయితే, హైపర్ ఆది వచ్చిన తర్వాత ప్రతి స్కిట్‌నూ వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు. గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ.. తన టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. దీంతో అతడి కోసమే షోను చూసే వాళ్లు తయారైపోయారు.

  ఆది స్కిట్లే హైలైట్... ఎప్పుడూ ట్రెండింగే

  ఆది స్కిట్లే హైలైట్... ఎప్పుడూ ట్రెండింగే

  జబర్ధస్త్‌లోకి హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వకముందు చాలా మంది టీమ్ లీడర్లు హవాను చూపించారు. కానీ, అతడు ప్రవేశించిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎవరు ఎన్ని రకాల స్కిట్లు చేసినా అతడినే విజయం వరించేది. మరీ ముఖ్యంగా హైపర్ ఆది చేస్తున్న స్కిట్లే ఎప్పుడూ ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఇప్పటికే ఈ కమెడియన్ ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి.

  ఎవరినీ వదిలి పెట్టని యంగ్ కమెడియన్

  ఎవరినీ వదిలి పెట్టని యంగ్ కమెడియన్

  హైపర్ ఆది తన స్కిట్లలో ఎక్కువ భాగం సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. అలాగే, అద్భుతమైన టైమింగ్‌తో తన టీమ్ మెంబర్లపై పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టడు. ఇలా ఒకటే స్కిట్లో ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సెటైర్లు పేలుస్తుంటాడు. ఈ కారణంగానే అవన్నీ ఫన్నీగా సాగుతాయి.

  యాంకర్ రష్మీతో కోరిక తీర్చుకున్న ఆది

  యాంకర్ రష్మీతో కోరిక తీర్చుకున్న ఆది

  ఎప్పుడూ గురువారం ప్రసారం అయ్యే జబర్ధస్త్‌లోనే కనిపించే హైపర్ ఆది.. వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న ‘ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్'లోనూ స్పెషల్ స్కిట్ చేయబోతున్నాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో అతడి స్కిట్‌ను హైలైట్ చేసి చూపించారు. ఇందులో యాంకర్ రష్మీ గౌతమ్‌తో ఆది ఇంట్రడక్షన్ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. ఇందులో ఆమె గ్రేస్‌తో స్టెప్పేస్తే.. అతడు మాత్రం ఫన్నీగా చేశాడు.

  ఆమెకు మంచం చూపిస్తూ అలాంటి మాట

  ఆ పాట అయిపోగానే తన సీటు దగ్గరకు వెళ్లిపోతూ రష్మీ గౌతమ్ ‘చాలా.. కోరిక తీరిపోయిందా? ఇంక వెళ్లిపోవచ్చా' అంటూ అడిగింది. దీంతో హైపర్ ఆది ‘మీరు ఇంక వెళ్లిపోవచ్చు. ఇంకా ఉంటే ఇక్కడ వేరే కార్యక్రమం ఉంది. దానికి మీరెందుకు' అంటూ మంచాన్ని చూపించాడు. తద్వారా ఫస్ట్ నైట్‌కు మీరు వద్దు అన్నట్లు పరోక్షంగా చెప్పాడు. దీంతో రష్మీ షాకై నోరెళ్లబెట్టేసి చూసింది.

  నువ్వు వంగలేవు... నేను అని బూతులు

  నువ్వు వంగలేవు... నేను అని బూతులు

  ఇక, ఈ ఎపిసోడ్‌లో హైపర్ ఆది ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులను వాడుతూ స్కిట్ చేసినట్లు కనిపించింది. అతడికి భార్య గెటప్ వేసిన శాంత కుమార్‌ను చూసి భయంతో మంచం కిందకు దూరతాడు ఆది. అప్పుడు శాంత ‘ఏవండీ నేను వంగలేను బయటకు రండీ' అంటాడు. అప్పుడు హైపర్ ఆది ‘నువ్వు వంగలేవు.. బయటకు వస్తే నేను..... ' అంటూ డైలాగును మింగేస్తాడు.

  English summary
  Jabardasth Talented Comedian Hyper Aadi Dance with Anchor Rashmi Gautam. Then He Used Double Meaning Dialogues on her
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X