For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Karthika Deepam’ సీరియల్‌పై మంచు లక్ష్మీ ట్వీట్: ఆయన ఫస్ట్ టైమ్ ఏడ్చాడు.. మా అమ్మ చాలా హ్యాపీ అంటూ!

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మరింత ఎక్కువ ఆదరణ లభిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే మన దగ్గర వచ్చేవి ఏళ్ల తరబడి రన్ అవుతూనే ఉంటాయి. ఇలా ఇప్పటికే ఎన్నో ధారావాహికలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సుదీర్ఘ కాలం పాటు ప్రసారం అయ్యాయి. ఇప్పుడదే జాబితాలోకి వచ్చింది 'కార్తీక దీపం' సీరియల్. దీనికి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకూ ఫిదా అయిపోయారు. అందుకే ఎంతో మంది ఈ సీరియల్‌పై తరచూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మీ దీనిపై ట్వీట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

  దానికి రీమేక్‌గా వచ్చిన కార్తీక దీపం

  దానికి రీమేక్‌గా వచ్చిన కార్తీక దీపం


  తెలుగులో సూపర్ డూపర్ హిట్‌ అయిన సీరియల్‌గా వెలుగొందుతోంది ‘కార్తీక దీపం'. దాదాపు మూడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోన్న ఇది ‘కరుతముత్తు' అనే మలయాళ సీరియల్‌కు రీమేక్‌గా వచ్చింది. ఇక, ఇందులో హీరో డాక్టర్ బాబు.. దీపను పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కవలలు తల్లిదండ్రులను ఎలా కలిపారనేదే దీని నేపథ్యం.

  సొంతం మనిషిలా మారిన వంటలక్క

  సొంతం మనిషిలా మారిన వంటలక్క

  సినిమా హీరోయిన్లకే ఎక్కువ ఆదరణ లభిస్తుంటుంది. అయితే, అదంతా గతం అని నిరూపించింది ‘కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈమె.. ప్రతి ఇంట్లో సొంత మనిషిలా మారిపోయింది. దీంతో తనను తాను తెలుగింటి ఆడపడుచుగా భావిస్తున్నారు. ఈ కారణంగానే ఈమె ఎనలేని క్రేజ్‌ను అందుకుందని చెప్పొచ్చు.

  ఇండియాలోనే అత్యంత భారీ స్థాయి

  ఇండియాలోనే అత్యంత భారీ స్థాయి


  ‘కార్తీక దీపం' సీరియల్‌కు మొదటి నుంచీ విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో రేటింగ్ లభిస్తోంది. అంతేకాదు, ఎన్నో చానెళ్లలో వస్తున్న షోలు సైతం దీని ముందు దిగదుడుపే అవుతున్నాయి. అంతలా రేటింగ్ సాధిస్తోందీ వంటలక్క సీరియల్. ఆరంభం నుంచీ ఇదే రేంజ్‌లో రేటింగ్ రాబడుతూ దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి సీరియల్‌గా నిలుస్తోంది.

  దాన్ని కూడా దాటేసిన కార్తీక దీపం

  దాన్ని కూడా దాటేసిన కార్తీక దీపం

  ‘కార్తీక దీపం' సీరియల్ రోజు రోజుకూ కొత్త మలుపు తిరుగుతూ సాగిపోతోంది. దీంతో ప్రేక్షకులకు మరింత మజాను పంచుతోంది. ఈ మధ్యనే ఇది 1000 ఎపిసోడ్స్‌ను కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, ప్రతి రోజూ ఏదో ఒక ఆసక్తికరమైన అంశాన్ని జోడించి ఈ సీరియల్‌ను విజయవంతంగా ప్రసారం చేస్తున్నారు. దీంతో దీనికి ఫ్యాన్స్ మరింతగా పెరిగిపోతున్నారు.

  నిజం తెలిసి.. రక్తి కడుతోన్న సీరియల్

  నిజం తెలిసి.. రక్తి కడుతోన్న సీరియల్

  సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ వస్తోన్న ‘కార్తీక దీపం' సీరియల్ తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం మొత్తం ఎమోషనల్‌గా సాగుతోంది. మరీ ముఖ్యంగా గత ఎపిసోడ్‌లో డాక్టర్ బాబుకు దీప గురించి నిజం తెలిసిపోయింది. దీంతో ఆమెకు ఎంతో అన్యాయం చేశానని గుర్తు చేసుకున్న అతడు.. ఏడుస్తూ కింద పడిపోయాడు. దీంతో ఈ టాప్ సీరియల్ మరింతగా రక్తి కట్టింది.

  ‘కార్తీక దీపం’పై మంచు లక్ష్మీ ట్వీట్

  ‘కార్తీక దీపం’పై మంచు లక్ష్మీ ట్వీట్


  ‘కార్తీక దీపం' సీరియల్‌ను సామాన్య ప్రేక్షకులే కాదు.. సినీ సెలెబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు స్వయంగా వెల్లడించారు. మరీ ముఖ్యంగా అన్ని ఇళ్లలో మాదిరిగానే తమ ఇంట్లో కూడా ఈ ధారావాహికకు ఫ్యాన్స్ ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మీ ‘కార్తీక దీపం' సీరియల్‌పై ఆసక్తికరమై ట్వీట్ చేసింది.

  Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
  ఆయన ఏడ్చాడు.. అమ్మ హ్యాపీ అని

  ఆయన ఏడ్చాడు.. అమ్మ హ్యాపీ అని


  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీ.. తాజాగా తన ట్విట్టర్‌లో ‘‘కార్తీక దీపం సీరియల్‌తో హీరో కార్తీక్ ఫస్ట్ టైమ్ ఏడ్చాడంట. మొత్తానికి దీనిపై మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది' అంటూ పేర్కొంది. దీని బట్టి ఈ సీరియల్‌కు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, మంచు లక్ష్మీ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తుండడం గమనార్హం.

  English summary
  Tollywood Heroine Manchu Lakshmi is Very Active in Social Media. Now She Tweet about Telugu People favourite Serial Karthika Deepam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X