For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ రియల్ బిహేవియర్ బయటపెట్టిన ఫ్యామిలీ మాన్ నటుడు.. ఎవరినీ వదలడు అంటూ!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన క్రేజ్ ఉంది. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పవన్ తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ కూడా ఏర్పరచుకున్నాడు. మరో ఆసక్తిరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కి సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతూ ఉంటారు. తాజాగా అలాగే పవన్ కళ్యాణ్ మీద ఒక నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..ఆ వివరాల్లోకి వెళితే

  అభిమానులు కాదు భక్తులే

  అభిమానులు కాదు భక్తులే

  మెగా ఫ్యాన్స్ హీరో సాధారణమైన, సామాన్యమైన వ్యక్తిత్వాన్ని బాగా ఇష్టపడతారు. అందుకే అంతే సాదాసీదాగా జీవితం గడిపే పవన్ కి ఆ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇక ఆయనకు ఉన్న డైహార్డ్ ఫ్యాన్స్ సంఖ్య చెప్పలేము. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలలో కూడా ఆయనకు ఎంత మంది అభిమానులు ఉన్నారు. యంగ్ హీరో నితిన్, బండ్ల గణేష్ లాంటి సెలబ్రిటీలు ఆయనకు వీరాభిమానులు. ఇక బండ్ల గణేష్ భక్తి అయితే వేరే రేంజ్. పవన్ ను బండ్ల గణేష్ దేవుడిగా కొలుస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సెలబ్రిటీ పవన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతనెవరో కాదు ఫ్యామిలీ మ్యాన్ 2 నటుడు రవీంద్ర విజయ్.

  రవీంద్ర విజయ్ క్రేజ్

  రవీంద్ర విజయ్ క్రేజ్

  రవీంద్ర విజయ్ తెలుగులో సత్యదేవ్ హీరోగా సరికొత్త కథాంశంతో తెరకెక్కిన "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య"లో విలన్ గా కనిపించాడు. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో మొండి పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అలాగే దేశం మొత్తం మీద ఆసక్తి రేకెత్తించిన ఫ్యామిలీ మాన్ 2 లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

  ఆయన జూలై 30 న విడుదలైన తేజ సజ్జ "ఇష్క్ ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ" చిత్రంలోనూ నెగటివ్ రోల్ లో కనిపించాడు. టాలీవుడ్ లో నెమ్మదిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్న విజయ్ రవీంద్ర పవన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నటుడు ఈ ఈ మేరకు కామెంట్లు చేశారు.

  అయ్యపనుం రీమేక్ లో కూడా

  అయ్యపనుం రీమేక్ లో కూడా


  ప్రస్తుతం పవన్ కళ్యాణ్... రానా దగ్గుబాటి తో కలిసి మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ "అయ్యప్పనుమ్ కోషీయం" రీమేక్ లో నటిస్తున్నారు. కే సాగర్ కు చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి "ప్రొడక్షన్ -12" అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  ప్రస్తుతం ఈ టీం పవన్, నిత్యాల పై వచ్చే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. తాజాగా "ది ఫ్యామిలీ మాన్-2" నటుడు రవీంద్ర విజయ్ ఈ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ విషయంలో తను గమనించిన విషయాలు వెల్లడించాడు.

  ఎవరినీ వదలడు

  ఎవరినీ వదలడు

  పవన్ కళ్యాణ్ చాలా ప్రొఫెషనల్ అని, ఆయన తన తోటి కళాకారుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటాడని రవీంద్ర వెల్లడించాడు. షూటింగ్ సమయంలోనే కాకుండా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో కూడా పొరపాటున కూడా ఎవరినీ బాధ పెట్టరని రవీంద్ర విజయ్ చెప్పారు. చిన్నోడా, పెద్దోడా అని చూడరు అని, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారని అన్నాడు.

  షూటింగ్ సమయంలో ఈ విషయాలన్నీ ఆయనలో గమనించానని ఈ నటుడు చెప్పుకొచ్చాడు. "పవన్ కరాటేలో శిక్షణ పొందాడు. అలాగే సన్నివేశాల షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ టైం, ఖచ్చితత్వం గురించి ఆరాటపడుతుంటారు. ఆ సమయంలో ఆయనలో ఉన్న కరాటే కళాకారుడు ప్రతిబింబిస్తాడనీ అంటూ ఆయన పవన్ గురించి చెప్పుకొచ్చారు.

  Vijay Devarakonda Birthday : టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా రికార్డు | Liger Teaser || Filmibeat Telugu
  సూపర్ క్రేజ్

  సూపర్ క్రేజ్

  ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ అదరగొట్టేశాడు. ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదల కానుంది. సంక్రాంతి బరిలో మరో రెండు స్టార్ హీరోల సినిమాలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్"రాధే శ్యామ్", సూపర్ స్టార్ మహేష్ బాబు "సర్కారు వారి పాట" కూడా ఉన్నాయి.

  మరో వైపు పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో భారీ మూవీ రూపొందనుంది. పీరియాడిక్ డ్రామాకు "హరిహర వీరమల్లు" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ రెండు చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో pspk 28 లో నటించబోతున్నాడు.

  English summary
  Actor Ravindra Vijay is becoming quite popular in Telugu movies.. he debuted with umamaheswara ugraroopasya movie last year.. in the meanwhile she also appeared as an police officer in family Man 2. in a recent interview he made some interesting comments on Pawan Kalyan
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X