For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆయన చేతిలో వకీల్ సాబ్-2.. క్లారిటీ ఇచ్చేశారు!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు వకీల్ సాబ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి సినిమా రావడంతో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడా పింక్ రీమేక్ లా అనిపించకుండా స్ట్రైట్ సినిమానా ? అనేంతలా తీర్చిదిద్దాడు దర్శకుడు వేణు శ్రీ రామ్. అయితే ఈ సినిమా భారీ క్రేజ్ తెచ్చుకున్న నేపథ్యంలో రెండో భాగం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది.. తాజాగా ఈ అంశాల మీద దర్శకుడైన శ్రీరామ్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

  ఆ సినిమా కోసం వెయిట్ చేసి

  ఆ సినిమా కోసం వెయిట్ చేసి

  అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ అందుకున్న పవన్ ఇక ఆ తర్వాత సినిమాలు చేయను ఇక తన జీవితం రాజకీయాలకే పరిమితం అంటూ ప్రకటన చేశారు.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు ఎదురు కావడంతో పవన్ మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.. అయితే రొటీన్ సినిమాలు చేయడం కంటే సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ అలాంటి సినిమాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో దిల్ రాజు ఈ పింక్ రీమేక్ కధ చెప్పడం జరిగింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడంతో పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ రూపుదిద్దుకుంది.

   క్లాస్ విత్ మాస్

  క్లాస్ విత్ మాస్

  సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడంతో మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ దెబ్బతో భారీ కలెక్షన్స్ కూడా సాధించింది. కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించేసిన నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్లు ఎంత సాధించింది అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా కంటెంట్ జనానికి బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ మాస్ యాంగిల్ లో చూపిస్తూనే మరోపక్క క్లాస్ సైకిల్ తో మేనేజ్ చేస్తూ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

  ఇంటర్వ్యూలో క్లారిటీ

  ఇంటర్వ్యూలో క్లారిటీ

  దీంతో వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కొంతమంది అయితే ఈ మేరకు వకీల్ సాబ్ 2 ట్రెండ్ కూడా చేశారు. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కి వేణు శ్రీరామ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో చాలా మంది అభిమానులు అడిగిన ప్రశ్నలను యాంకర్ వేణు శ్రీరామ్ ముందుంచారు.. అలా వుంచిన సమయంలోనే వకీల్ సాబ్ 2 చేసే అవకాశం ఉందా ? అని అడిగిన ప్రశ్నకు వేణు శ్రీరామ్ ఆసక్తికరంగా స్పందించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందంతో తేలిపోతున్నారు.

  అవకాశం ఉంది

  అవకాశం ఉంది

  ఈ అంశం మీద శ్రీరామ్ స్పందిస్తూ ముందుగా అసలు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అభిమానులతో పాటు చాలా మంది సన్నిహితులు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు అని పేర్కొన్నాడు. ఇంతకుముందు వకీల్ సాబ్ అంటే ఎవరో తెలియదు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వకీల్ సాబ్ క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ అయిందని కాబట్టి ఈ కథను కొనసాగించి మరో సబ్జెక్టు కూడా రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

  Pawan Kalyan కి COVID19: అసలు హీరో ఉన్నట్టా లేనట్టా? RGV, కాళ్లు పిసుకుతా -Srireddy
  ఉండి తీరుతుందట

  ఉండి తీరుతుందట

  కానీ అలా చేయాలంటే పవన్ కళ్యాణ్ మరో అవకాశం ఇవ్వాలని అలాగే దిల్ రాజు కూడా ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వస్తే అప్పుడు కచ్చితంగా దీనికి సీక్వెల్ చేసే ఆలోచన చేస్తాం అని చెప్పుకొచ్చాడు.. పవన్ కళ్యాణ్ దిల్ రాజు ఇద్దరు సమ్మతిస్తే అప్పుడు ఈ సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ఫాన్స్ ఇక ఆనందంలో తేలిపోతున్నారు. దానికి కారణం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని ఇక అడ్వాన్స్ కూడా తీసుకున్నారని ప్రచారం జరగడమే. ఈ లెక్కలు వేసుకుంటూ వకీల్ సాబ్ 2 సినిమా కూడా ఉండే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  As we all know Pawan kalyan starrer vakeel saab performed well at theatres and OTT. Now for a few days some speculations about the film's sequel is coming out. Recently director venu sri ram gave clarity on the sequel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X